Lawrence Bishnoi : గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతీ జైలులో ఉన్నాడు. అయినా అతడిపై యావత్ దేశంలో చర్చ జరుగుతోంది. ఇటీవలే ముంబైలో జరిగిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ మర్డర్ వ్యవహారంలోనూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే క్షత్రియ కర్ణి సేన సంచలన వార్నింగ్ మెసేజ్‌ను విడుదల చేసింది. సబర్మతీ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసే పోలీసులకు రూ.1.11 కోట్ల రివార్డు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు క్షత్రియ కర్ణి సేన(Lawrence Bishnoi) జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేయడం గమనార్హం. ఈవిధంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రకటనలను ఎంతోమంది చేస్తున్నా.. కట్టడికి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read :Seoul Special : మూసీకి మహర్దశ.. సియోల్‌లోని ‘చుంగేచాన్’ రివర్ ఫ్రంట్ విశేషాలివీ
‘‘లారెన్స్ బిష్ణోయ్‌ను జైలులో ఎన్‌కౌంటర్ చేయండి చాలు. ఈపనిని చేసిపెట్టే పోలీసు అధికారి కుటుంబ భవిష్యత్తు కోసం రూ.కోటికిపైనే ఇస్తాం. లారెన్స్ బిష్ణోయ్ జైలు నుంచే గ్యాంగ్ నడుపుతున్నాడు. అతడి గ్యాంగ్ ఎన్ని హత్యలకు పాల్పడుతున్నా కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. మా (కర్ణిసేన) సంస్థ అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగామెడిని చంపిన వారిని కూడా అస్సలు వదలం’’ అని రాజ్ షెకావత్ వ్యాఖ్యలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read :HMDA Layouts : నిషేధిత జాబితాలో ఆ లేఅవుట్లు.. భూ యజమానుల బెంబేలు
- 2023 డిసెంబరులో రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామెడిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. అనంతరం ఆ మర్డర్ తమ పనే అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.
- ఇటీవలే ముంబైలో ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత, సల్మాన్‌ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీని కూడా తామే మర్డర్ చేశామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వెల్లడించింది.
- దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉండటం వల్లే బాబా సిద్ధిఖీని హత్య చేశామని లారెన్స్ గ్యాంగ్ తెలిపింది.
- సిద్ధూ మూసేవాలా హత్య వెనుక కూడా లారెన్స్ ఉన్నాడని అంటారు. కెనడాలో ఉన్న లారెన్స్ అనుచరులు మనదేశంలో గ్యాంగ్‌ను నడుపుతుంటారనే టాక్ నడుస్తోంది.