Site icon HashtagU Telugu

Economic Offenders : నేరగాళ్ళను ఇండియాకి రమ్మంటున్న మోదీ

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు తిరిగి భారత్‌కు రావాలని మోదీ పిలుపునిచ్చారు. అలాంటివారిని తీసుకు రావడానికి తాము చట్టాల పైన ఆధారపడ్డామని, దౌత్య మార్గాలను ఉపయోగించామని మోదీ తెలిపారు. ఇక ఉద్యోగాలను, సంపందను సృష్టించేవారిని కాపాడుకోవాలని మోదీ అన్నారు.

దేశ ఆర్థికాభివృద్ధిలో ఉద్యోగ కల్పనలో బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయని, బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్లతో దేశ బ్యాలెన్స్ షీట్‌ను వృద్ధి చేయాలని మోదీ ఆకాంక్షించారు. బ్యాంకులకు ప్రభుత్వం నుండి మరింత మద్దతు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు.

Also Read: చంద్ర‌యాన్ 2 రోవ‌ర్ క‌క్ష్యలో మార్పులు – ఇస్రో

గత ఆరేడేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా నేడు బ్యాంకింగ్ రంగం బలపడిందని, మొండి బకాయిల వసూళ్లలో ప్రోగ్రెస్ కనిపించినట్లు ప్రధాని అన్నారు.

ఎన్‌పీఏ, బ్యాంక్‌లకు మూలధనం సమకూర్చడం వంటి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. ప్రస్తుతం బ్యాంకుల వద్ద సరిపడా మూలధనం ఉండటంతో పాటు ఎన్పీఏల భారం కూడా తగ్గిందన్నారు..

Also Read: కేసీఆర్ ఎత్తుగ‌డ‌తో రేవంత్ చిత్తు

వర్చువల్ కరెన్సీలను నియంత్రించడంలో సహకరించాలని, ప్రజాస్వామ్య దేశాలు వీటిలో విఫలమైతే అవి తప్పుడు చేతుల్లోకి వెళ్లవచ్చునని ప్రధాని అభిప్రాయపడ్డారు.