Retired Soldier: రూ.49 వేలు డబ్బు డ్రా చేశాడు.. గేటు కూడా దాటకముందే డబ్బు మాయం.. ఎలా అంటే?

ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక వ్యక్తి రిటైర్డ్ సోల్జర్. అయితే అతను బ్యాంకు దగ్గరికి వెళ్లి 49 వేలు డబ్బులు విత్ డ్రా

  • Written By:
  • Publish Date - July 16, 2022 / 10:31 AM IST

ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక వ్యక్తి రిటైర్డ్ సోల్జర్. అయితే అతను బ్యాంకు దగ్గరికి వెళ్లి 49 వేలు డబ్బులు విత్ డ్రా చేసుకున్నాడు. ఆ డ్రా చేసిన డబ్బులు తనతో తెచ్చుకున్న బ్యాగులో సర్దుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అతను తన బ్యాగులో 49 వేలు డబ్బు పెట్టిన నిమిషాల వ్యవధిలోనే అతని బ్యాగ్ లో నుంచి డబ్బు మాయం అయింది. అతడు బ్యాంకు గేటు దాటకముందే బ్యాగులో డబ్బు లేదు అని గ్రహించి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తీరా సీసీ కెమెరాలను చెక్ చేయడంతో అసలు విషయం కాస్త బయటపడింది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది. మరి ఆ డబ్బు ఏమయింది? సీసీ కెమెరాలను ఏం కనిపించింది?ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రాజస్థాన్‌లోని షాపురా‌కు చెందిన భవానీ సింగ్ కొన్ని సంవత్సరాలపాటు సైనికుడిగా పని చేసి రిటైర్ అయ్యారు. అయితే తాజాగా తన కూతురికి వివాహం కూడా చేసి అత్తారింటికి పంపించారు. ఈ క్రమంలోనే ఆయన కూతురు కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులతో సరదాగా గడిపి అత్తారింటికి తిరుగు పయనం అయింది. అయితే కూతురిని ఖాళీ చేతులతో పంపడం ఇష్టం లేని భవానీ సింగ్ డబ్బులు లేకపోవడంతో విత్‌డ్రా చేయడానికి స్థానికంగా ఉన్న ఎస్పీఐ బ్యాంకుకు వెళ్లారు. తన కూతురికి కొంతడబ్బులు ఇచ్చి మరికొంత మొత్తాన్ని ఇంటి ఖర్చులకు వాడుకోవచ్చనే ఉద్దేశంతో సుమారు రూ.49వేలు వరకు విత్‌డ్రా చేశారు.

ఆ మొత్తాన్ని తన వెంట తెచ్చుకున్న బ్యాగులో పెట్టుకుని డబ్బుతో కూడిన ఆ బ్యాగును బ్యాంకులోనే కుర్చీపై పెట్టి ఓ చిన్న పని మీద కొంచెం పక్కకు వెళ్లారు. అనంతరం బ్యాగు వద్దకు తిరిగొచ్చి అందులో డబ్బులు లేవని గుర్తించి షాక్ అయ్యాడు. వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన బ్యాంకు అధికారులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఓ కుర్రాడు డబ్బులను కాజేసినట్టు గుర్తించి విస్తుపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భవానీ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.