Site icon HashtagU Telugu

Agniveers : రిటైర్ అయ్యే అగ్నివీర్లకు పోలీస్ జాబ్స్ : హర్యానా సీఎం

Lal Khattar

Lal Khattar

సైన్యంలో నాలుగేళ్ళ సర్వీసు తర్వాత పదవీ విరమణ పొందే అగ్నివీర్ల కు ఉద్యోగాలిస్తామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. వాళ్లకు గ్రూప్ -సీ లేదా హర్యానా పోలీస్ విభాగంలో జాబ్స్ ఇస్తామని వెల్లడించారు. తప్పకుండా ఈ హామీలు అమలుపర్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ కూడా తమ కంపెనీలో అగ్నివీర్లకు జాబ్స్ ఇస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇకపై సైన్యంలో కేవలం అగ్నిపత్ స్కీం ద్వారా భర్తీ జరుగుతుందని ఇటీవల రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఈ పథకం అమలు విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది. కాగా, అగ్నిపత్ స్కీం ద్వారా భర్తీ అయ్యే అగ్ని వీర్లలో నాలుగేళ్ళ తర్వాత 25 శాతం మందికే ఉద్యోగ కొనసాగింపు ఉంటుంది. మిగితా వారంతా వివిధ బెనిఫిట్స్ తీసుకొని రిటైర్ కావాల్సి ఉంటుంది. ఈ రిటైర్మెంట్ పైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి.