Republic Day 2026: భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ (26 జనవరి, 2026) వేడుకల సందర్భంగా ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. భద్రతను పర్యవేక్షించేందుకు సైనిక బలగాలతో పాటు అత్యాధునిక సాంకేతికతను కూడా వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు మొదటిసారిగా ఒక ప్రత్యేకమైన టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు.
నేరస్తులను గుర్తించే ‘స్మార్ట్ గ్లాసెస్’
జనవరి 26 పరేడ్ సమయంలో ఢిల్లీ పోలీసులు మొదటిసారిగా నేరస్తులను గుర్తుపట్టే ప్రత్యేకమైన స్మార్ట్ కళ్లజోళ్లను (Smart Glasses) ధరించనున్నారు. కొంతమంది ఎంపిక చేసిన పోలీసు సిబ్బంది ఈ కళ్లజోళ్లను ధరించి విధుల్లో పాల్గొంటారు. ఇవి కేవలం నేరస్తులను గుర్తించడమే కాకుండా థర్మల్ స్కానింగ్ ద్వారా ఆయుధాల వంటి ప్రమాదకర వస్తువులను కూడా కనిపెట్టగలవు.
Also Read: న్యూజిలాండ్‌పై సరికొత్త చరిత్ర సృష్టించిన టీమిండియా!
ఈ కళ్లజోళ్ల ప్రత్యేకతలు ఏమిటి?
సమాచారం ప్రకారం.. ఈ ప్రత్యేక కళ్లజోళ్లలో మూడు ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.
ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు): ఈ కళ్జోళ్లకు ఒక చిన్న కెమెరా అమర్చబడి ఉంటుంది. పోలీసులు దీనిని మొబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకుంటారు. ఇందులో సుమారు 65,000 మంది నేరస్తుల డేటా నిక్షిప్తమై ఉంటుంది. పోలీసులు గుంపులోకి చూసినప్పుడు, కెమెరా ఎదురుగా ఉన్న వ్యక్తుల ముఖాలను స్కాన్ చేస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తికి నేర చరిత్ర ఉంటే కళ్లజోడు వెంటనే పోలీసును హెచ్చరిస్తుంది.
ముఖం మార్చుకున్నా దొరికిపోతారు (AI & FRS): నేరస్తుడు తన వేషధారణ లేదా లుక్ మార్చుకున్నా ఈ కళ్జోళ్ల నుండి తప్పించుకోలేడు. ఇందులో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), FRS (Face Recognition System) ఉన్నాయి. డేటాలో పాత ఫోటో ఉన్నప్పటికీ ముఖ కవళికల ఆధారంగా అసలు వ్యక్తిని ఇవి ట్రాక్ చేస్తాయి.
థర్మల్ స్కానింగ్ సాంకేతికత: ఈ కళ్జోళ్లలోని మూడవ, అత్యంత కీలకమైన ఫీచర్ థర్మల్ స్కానింగ్. దీని సహాయంతో పోలీసులు పరేడ్‌కు వచ్చిన వారి శరీరాలను స్కాన్ చేయవచ్చు. ఎవరైనా నిషేధిత వస్తువులను లేదా ఆయుధాలను దాచుకుని లోపలికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే, అవి వెంటనే పట్టుబడతాయి.
