Tattoos : టాటూలను 15 రోజుల్లోగా తొలగించాలి..పోలీసులకు ఆదేశం

  • Written By:
  • Publish Date - April 11, 2024 / 05:21 PM IST

Remove Tattoos: పోలీసుల(police) శరీరంపై టాటూలు(Tattoos) అవమానకరమ(Shameful)ని ఆ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో యూనిఫాం బయట కనిపించే పచ్చబొట్లను 15 రోజుల్లో తొలగించాలని పోలీస్ శాఖ ఆదేశించింది. (Remove Tattoos) పోలీస్‌ సిబ్బందిలో మర్యాద, సమగ్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఒడిశా పోలీస్‌ శాఖ(Odisha Police Department) ఈ మేరకు పోలీస్‌ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. భువనేశ్వర్, కటక్‌ పరిధిలోని జంట నగరాల కమిషనరేట్లకు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సెక్యూరిటీ) ఈ లేఖ జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, చాలా మంది పోలీస్‌ సిబ్బంది శరీరాలపై టాటూలున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘ఒడిశా పోలీసులు, బెటాలియన్‌ ప్రతిష్టను ఇది దిగజార్చుతోంది. పచ్చబొట్లతో అసభ్యకరంగా, అభ్యంతరకరంగా కనిపిస్తున్నారు. ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాత టాటూలను తొలగించాలని నిర్ణయించాం. యూనిఫాం ధరించినప్పుడు కనిపించే టాటూలను అనుమతించబోం’ అని ఆర్డర్‌ జారీ చేశారు.

Read Also: Harish Rao : కాంగ్రెస్ వచ్చింది.. కరవు మొదలైంది – హరీష్ రావు

మరోవైపు శరీరంపై టాటూలున్న పోలీసుల జాబితాలను సిద్ధం చేయాలని, 15 రోజుల్లో ఆదేశాలు పాటించేలా చర్యలు చేపట్టాలని ఒడిశా పోలీస్‌ శాఖ ఆదేశించింది. అలాగే నిర్ణీత గడువులోగా టాటూలు తొలగించడంలో పోలీసులు విఫలమైతే, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించింది. ముఖం, మెడ, చేతులు వంటి కనిపించే శరీర భాగాలపై టాటూలు వేయించుకోవద్దని పోలీసులకు సూచించింది.