Reliance Industries: పశ్చిమ బెంగాల్‌లో 20 వేల కోట్ల పెట్టుబడులు

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ పశ్చిమ బెంగాల్‌లో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు.

Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ పశ్చిమ బెంగాల్‌లో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో ఈ మొత్తంపెట్టుబడి పెట్టనున్నారు. కోల్‌కతాలో జరుగుతున్న 7వ బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొన్న ముఖేష్ అంబానీ ఈ విషయాన్ని ప్రకటించారు.

బెంగాల్ అభివృద్ధిలో రిలయన్స్ ఇండస్ట్రీ పాలుపంచుకుంటుందని అంబానీ తెలిపారు. బెంగాల్‌లో రిలయన్స్ ఇప్పటివరకు దాదాపు రూ.45,000 కోట్ల పెట్టుబడులు పెట్టిందని. వచ్చే మూడేళ్లలో రూ.20 వేల కోట్ల అదనపు పెట్టుబడులు పెడతామని చెప్పారు. టెలికాం, రిటైల్, బయో ఎనర్జీ రంగాల్లో ఈ రూ.20 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు.

రాష్ట్రంలోని ప్రతి మూలకు 5జీని తీసుకెళ్తున్నామని, ముఖ్యంగా గ్రామీణ బెంగాల్‌ను కలుపుతున్నామని అంబానీ చెప్పారు. ఇప్పటికే బెంగాల్‌లోని చాలా ప్రాంతాలను కవర్ చేసినట్లు తెలిపారు. జియో నెట్‌వర్క్ రాష్ట్రంలోని 98.8% జనాభాను మరియు కోల్‌కతా టెలికాం సర్కిల్‌లోని 100% జనాభాను కవర్ చేస్తుందన్నారు. జియో నెట్‌వర్క్ పశ్చిమ బెంగాల్‌లో పెద్ద ఎత్తున ఉపాధితో పాటు విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు వ్యవసాయాన్ని పెంచుతుందని చెప్పారు.

రిలయన్స్ రిటైల్ వచ్చే రెండేళ్లలో పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 200 కొత్త స్టోర్లను ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుతం బెంగాల్‌లో దాదాపు 1000 రిలయన్స్ స్టోర్‌లు పని చేస్తున్నాయి, ఇవి 1200కి పెరుగుతాయని ముకేశ్ అంబానీ తెలిపారు. బెంగాల్‌లోని వందలాది చిన్న మరియు మధ్యతరహా వ్యాపారులు మరియు దాదాపు 5.5 లక్షల మంది కిరాణా దుకాణదారులు మా రిటైల్ వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్నారు. కొత్త దుకాణాలు ప్రారంభించడం వల్ల ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Also Read: Millionaire : శనివారం రోజు ఈ ఐదు రకాల నియమాలు పాటిస్తే చాలు.. కోటీశ్వరులు అవ్వడం కాయం..