Site icon HashtagU Telugu

PM Modi : భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివి : ప్రధాని మోడీ

Relations between India and Maldives are centuries old: PM Modi

Relations between India and Maldives are centuries old: PM Modi

Maldives President Mohamed Muizzu : మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత పర్యటన కొనసాగుతుందిఈ క్రమంలోనే అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షి చర్చలు జరిగాయి. హైదరాబాద్ హౌస్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాల్దీవుల్లోని హనిమధూ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేను ప్రధాని నరేంద్ర మోడీ , మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. అదే సమయంలో రూపే కార్డు ద్వారా చెల్లింపు మాల్దీవులలో ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జూ తొలిసారిగా ఇలాంటి లావాదేవీలకు శ్రీకారం చుట్టారు.

Read Also: Akkineni Nagarjuna : కొండా సురేఖ‌పై ప‌రువు న‌ష్టం దావా.. రేపు కోర్టుకు హాజరుకానున్న నాగార్జున

భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివి అని ప్రధాని మోడీ అన్నారు. భారతదేశం మాల్దీవులకు అత్యంత సన్నిహిత పొరుగు, సన్నిహిత మిత్రుడు అన్నారు. నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ, సాగర్ విజన్‌లో మాల్దీవులకు ముఖ్యమైన స్థానం ఉంది అని ప్రధాని మోడీ అన్నారు. రక్షణ, భద్రతా సహకారానికి సంబంధించిన వివిధ అంశాలను వివరంగా చర్చించామని మోడీ తెలిపారు. ఏకథా హార్బర్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్థిరత్వం, శ్రేయస్సు కోసం రెండు దేశాలు కలిసి పని చేస్తాం. కొలంబోలో వ్యవస్థాపక సభ్యులుగా సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌లో మాల్దీవులు చేరడానికి స్వాగతం పలుకుతున్నట్లు ప్రదాని మోడీ తెలిపారు.

కాగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో ఈ సమావేశం గురించి సమాచారం ఇస్తూ.. ‘భారత్-మాల్దీవుల ప్రత్యేక సంబంధాన్ని ముందుకు తీసుకువెళుతోంది. హైదరాబాద్ హౌస్‌కు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజును ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా స్వాగతించారు. భారత్-మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత చర్చ ఉంటుంది.’ అంటూ పేర్కొన్నారు.

Read Also: Sanjoy Roy : వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ జరగలేదు.. హత్యాచారం చేసింది సంజయ్ రాయే