India – US – NPCI : గుడ్ న్యూస్.. భారత్ – అమెరికా బ్యాంకుల మధ్య ‘పేమెంట్’ సర్వీస్ ?

India - US - NPCI : మారిషస్, శ్రీలంక, ఫ్రాన్స్, సింగపూర్ దేశాలకు మేడిన్ ఇండియా డిజిటల్ పేమెంట్ సర్వీస్ ‘యూపీఐ’ విస్తరించింది. 

  • Written By:
  • Updated On - February 13, 2024 / 01:03 PM IST

India – US – NPCI : మారిషస్, శ్రీలంక, ఫ్రాన్స్, సింగపూర్ దేశాలకు మేడిన్ ఇండియా డిజిటల్ పేమెంట్ సర్వీస్ ‘యూపీఐ’ విస్తరించింది.  ఈ దిశగా మరో కీలక ముందడుగు వేసేందుకు భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ముమ్మర కసరత్తు చేస్తోంది. లక్షలాది మంది ప్రవాస భారతీయులు అమెరికాలో ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. వారి సౌకర్యార్ధం రియల్ టైమ్ పేమెంట్ సర్వీస్ (ఆర్టీపీఎస్)ను తీసుకొచ్చేందుకు ఎన్‌పీసీఐ వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగా అమెరికాలోని పలు బ్యాంకులతో చర్చలు మొదలుపెట్టింది. ఆ చర్చలు కూడా తుదిదశకు చేరాయని మనదేశంలోని జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.

We’re now on WhatsApp. Click to Join

మనం ప్రస్తుతం మన దేశంలో ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకు నిర్భయంగా, నిరాటంకంగా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం. ఆయా బ్యాంకుల మధ్య అప్పటికే ఉన్న అవగాహనా ఒప్పందాల వల్లే ఈవిధంగా వివిధ బ్యాంకుల అకౌంట్లకు నగదు బదిలీ చేసుకునే వీలు కలుగుతోంది. ఇప్పటివరకు మన దేశ బ్యాంకులు, అమెరికా బ్యాంకుల మధ్య ఇలాంటి ఒప్పందమేదీ లేదు. ఇప్పుడు ఇరుదేశాల బ్యాంకుల మధ్య ఒప్పందాలను కుదిర్చేందుకే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) చర్చలు జరుపుతోంది. అమెరికా, భారత్ దేశాల బ్యాంకుల మధ్య ఒప్పందం నేరుగా జరగదని తెలుస్తోంది. దానికి బదులుగా NPCI వద్ద ఇప్పటికే లిస్టయి ఉన్న భారతీయ బ్యాంకులన్నీ అమెరికా బ్యాంకులతో రియల్ టైమ్ పేమెంట్‌కు అర్హతను పొందాయి. ఈమేరకు అమెరికా-భారత్ మధ్య ఆర్టీపీఎస్ చెల్లింపుల కోసం ప్రత్యేకమైన డిజిటల్ పేమెంట్ గేట్ వేను(India – US – NPCI) తెరుస్తారు. అమెరికా ప్రభుత్వం, అక్కడి కేంద్ర బ్యాంకు నుంచి ఆమోదం లభిస్తే.. ఈ చర్చలు సఫలమవుతాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Also Read : Beggar Woman : ఈ బెగ్గర్ సంపాదన నెలకు లక్షల్లోనే.. ఆస్తులు కూడా !

2023 జులైలో FedNow పేరుతో ఇన్‌స్టాంట్ పేమెంట్ సర్వీసును అమెరికా కేంద్ర బ్యాంకు ప్రారంభించింది. ఇరుదేశాల మధ్య వేగవంతమైన చెల్లింపు సేవల కోసం FedNow‌తో జట్టుకట్టేందుకు  భారత్‌కు చెందిన NPCI ఆసక్తి చూపుతోందని అంటున్నారు.  ప్రస్తుతానికి FedNow‌ సేవలు అమెరికా వ్యాప్తంగా ఇంకా అందుబాటులోకి రాలేదు. అమెరికాలోని 50 రాష్ట్రాలకు  FedNow‌ సేవలను విస్తరించేందుకు మరో ఏడాది  పడుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే తొలి విడతగా చిన్న మొత్తాలను ఇరుదేశాల మధ్య రియల్ టైం పేమెంట్ సర్వీస్ ద్వారా బదిలీ చేసుకునే  ఛాన్స్ కల్పించాలని యోచిస్తున్నారట.  ఏదిఏమైనప్పటికీ ఈ దిశగా ఏదైనా నిర్ణయం వెలువడితే అది లక్షలాది మంది ప్రవాస భారతీయులకు, ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు గుడ్ న్యూసే అవుతుంది.

Also Read : Meta – Political : ఎన్నికల వేళ పొలిటికల్‌ కంటెంట్‌పై ఫేస్‌బుక్ కీలక నిర్ణయం

Follow us