Site icon HashtagU Telugu

Junagadh cafe : ప్లాస్టిక్ చెత్త ఇవ్వండి…ఆ కేఫ్ లో నచ్చింది..తినొచ్చు..తాగొచ్చు…ఎక్కడంటే..!!

junaghad cafe

junaghad cafe

జులై 1వ తారీఖు నుంచి ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గుజరాత్ లోని జునాగఢ్ ప్రాంతంలో ఈనెల 30న వెలసిన ఓ కేఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.

ఈ కేఫ్ కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటారా..అక్కడికివెళ్లి..మనకు కావాల్సింది తిని…కావాల్సిన పానీయాలు తాగొచ్చు. చేతిలో చిల్లిగవ్వాలేకున్నా సరే. పర్యావరణానికి తూట్లు పొడిచే ప్లాస్టిస్ చెత్తను తీసుకొచ్చి ఇస్తే చాలు. ఇదేదో బాగుంది కదా. అయితే మీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ చెత్త..ఓ సంచిలో వేసుకుసి జునాగఢ్ లోని ఈ కేఫ్ కు వెళ్లంది. మీకు ఇష్టం ఉన్నవి తినండి. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం వినూత్న ప్రయత్నమే ఈ కేఫ్. దీంతో ప్రజల్లో ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

కాగా ఈ కేఫ్ లో ఉండే ఆహార పదార్థాలు సహజసిద్ధంగా పండించిన ముడి సరుకులను వినియోగిస్తారు. సర్వోదయ సాక్షి మండల్ ఈ కేఫ్ నిర్వహణను చూస్తోంది. పర్యావరణంగా స్వచ్చమైన, పరిశుభ్రమైన పట్టణంగా జునాగఢ్ ను తీర్చిదిద్దాలన్న ప్రయత్నమే ఈ కేఫ్ అని అధికారులు చెప్పారు.

అరకేజీ ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకెళ్తే గ్లాసు నిమ్మరసం ఇస్తారు. కిలో చెత్తకు పోహ వడ్డిస్తారు. ఈ రెస్టారెంట్ సమీకరించిన ప్లాస్టిక్ ను కొనుగోలు చేసుందుకు అధికారులు ఓ ఏజెన్సీని కూడా నియమించుకున్నారు. వాట్ ఎన్ ఐడియా సర్ జీ అంటూ నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు.

 

Exit mobile version