Site icon HashtagU Telugu

Kejriwal : తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ మరో సందేశం

Aam Aadmi Party PAC meeting today evening

Aam Aadmi Party PAC meeting today evening

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో తీహార్ జైలు(TiharJail)లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) తన భార్య సునీతా కేజ్రీవాల్(Sunita Kejriwal) ద్వారా ఆప్ నేతలకు కీలక సందేశం(Key message) పంపించారు. రాజ్యాంగ రక్షణకు తాను సిద్ధంగా ఉన్నానని, కేంద్రంలోని నియంత ప్రభుత్వం సృష్టిస్తున్న అన్ని అవరోధాలు, దౌర్జన్యాలను భరించేందుకు తాను రెడీగా ఉన్నట్టు భార్య సునీతకు ఆయన చెప్పారని ఆప్ కీలక నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ మీడియాకు వెల్లడించారు. ఢిల్లీ ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఆప్ శ్రేణులు తమ సేవలను నిరంతరాయంగా కొనసాగించాలని కేజ్రీవాల్ కోరినట్టు తెలిపారు.

రాజ్యాంగాన్ని రక్షించడమే నేడు అత్యంత ముఖ్యమైన విషయమంటూ కేజ్రీవాల్ చెప్పారని, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాడు ‘సంవిధాన్ బచావో.. తనషాహీ హఠావో’ దినంగా పాటించాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారని రాయ్ పేర్కొన్నారు. కేజ్రీవాల్ నివాసంలో ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌తో పార్టీ నాయకత్వం భేటీ అయిన అనంతరం మంత్రి రాయ్ ఈ ప్రకటన చేశారు. కాగా,  తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌ను మంగళవారం ఆయన భార్య సునీత, వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ కలిశారు. ఏప్రిల్ 15 వరకు జుడీషియల్ కస్టడీని పొడగించిన తర్వాత తొలిసారి వారు కేజ్రీవాల్‌ను మంగళవారం కలిశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ-2021 సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి ఇవ్వగా.. తనను అరెస్టును రిమాండ్‌ను కేజ్రీవాల్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తనను అరెస్టు చేసిన మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. మార్చి 28న రౌస్‌ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీని ఏప్రిల్ ఒకటి వరకు.. ఆ తర్వాత ఏప్రిల్‌ 15 వరకు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది.

Read Also: Perni Nani : పేర్ని నానిఫై కేసు నమోదు