UPI Limit – 5 Lakhs : ఆస్పత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ లిమిట్.. ఇక రూ.5 లక్షలు

UPI Limit - 5 Lakhs : యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గుడ్ న్యూస్ వినిపించింది.

  • Written By:
  • Updated On - December 8, 2023 / 11:16 AM IST

UPI Limit – 5 Lakhs : యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గుడ్ న్యూస్ వినిపించింది.ఆసుపత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చేసేందుకు ఇంతకుముందు వరకు 1 లక్ష రూపాయల లిమిట్ ఉండేది. ఆ లిమిట్‌ను రూ.5 లక్షలకు పొడిగిస్తూ  తాజాగా శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అనౌన్స్‌మెంట్ చేశారు.  దీనివల్ల ఇకపై మనం ఆస్పత్రుల్లో వైద్య బిల్లుల చెల్లింపునకు.. విద్యా సంస్థల్లో విద్యార్థుల  ఫీజుల చెల్లింపునకు రూ.5 లక్షల దాకా యూపీఐ పేమెంట్స్ చేయగలుగుతాం. ఈ నిర్ణయం ఎంతోమందికి ప్రయోజనం కలిగించనుంది.

We’re now on WhatsApp. Click to Join.

శుక్రవారం రోజు జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) సమావేశంలో పలు నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. దేశంలో ‘ఈ- మ్యాన్‌డేట్’ల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగానూ ఒక కీలక అంశాన్ని ఆయన ప్రతిపాదించారు. మ్యూచువల్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్‌లు, ఇన్సూరెన్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లు, క్రెడిట్ కార్డ్ రీపేమెంట్‌ల కోసం ప్రతి లావాదేవీకి ఇప్పటివరకు గరిష్ఠంగా రూ. 15,000 విలువైన ‘ఈ- మ్యాన్‌డేట్’ సమర్పించే అవకాశమే ఉంది. అయితే ఇలాంటి రికరింగ్ ఆన్‌లైన్ లావాదేవీల కోసం ఈ – మ్యాన్‌డేట్‌ల పరిమితిని రూ. 1లక్ష దాకా పెంచాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ(UPI Limit – 5 Lakhs) ప్రతిపాదించింది.

Also Read: India – Cyber Alert : ఇండియాలో సైబర్ అలర్ట్.. పాకిస్తాన్, ఇండోనేషియా హ్యాకర్ల పన్నాగం