Site icon HashtagU Telugu

Paytm: పేటీఎమ్ బ్యాంక్ సంక్షోభంపై ఆర్బీఐ గవర్నర్ రియాక్షన్

Balance Check

Balance Check

Paytm: రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ పేటీఎమ్ బ్యాంక్ సంక్షోభంపై స్పందించారు. ఆంక్షలు విధించే ముందే ఆ సంస్థకి తగిన సమయం ఇచ్చామని స్పష్టం చేశారు. వాళ్ల తప్పుల్ని సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతోనే ఆంక్షలు విధించినట్టు వెల్లడించారు. తాము ఎప్పుడూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోమని తెలిపారు. సూపర్‌వైజరీ సిస్టమ్‌ని బలోపేతం చేశామని, ఏ సంస్థలో ఇలాంటి అవకతవకలు కనిపించినా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. పేటీఎమ్‌ సంస్థలోని సమస్యల్ని పరిష్కరించుకునేందుకు అవసరమైన సమయాన్ని ఇచ్చినట్టు తెలిపారు.

“మా నిఘా వ్యవస్థని చాలా బలోపేతం చేశాం. ఒక్క పేటీఎమ్ విషయంలోనే కాదు. ఏ సంస్థలో ఇలాంటి అవతకవతకలు అనిపించినా వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. ఏ సంస్థ అయినా తప్పులు సరిదిద్దుకోవాలన్నదే మా ఉద్దేశం. ఆంక్షలు విధించే ముందు తప్పులు సరిదిద్దుకోవాలని చెప్పాం. అందుకు తగిన సమయాన్నీ ఇచ్చాం. మాతో సరైన విధంగా సంప్రదింపులు జరపకపోతే…మేం అడిగిన సమాచారాన్ని ఇవ్వకపోతే అప్పుడే మేం చర్యలు తీసుకుంటాం” – శక్తికాంత దాస్, RBI గవర్నర్ అన్నారు.

వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ చర్యలు తీసుకుంటున్నామని శక్తికాంత దాస్ వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే ఇంకా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే..ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేనని, వచ్చే వారం కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తామని తెలిపారు.