RBI Extends : రూ.2 వేల నోట్ల మార్పిడి డేట్ ను పొడిగించిన RBI

ఈరోజు పలు బ్యాంకులకు సెలవు ఉండటం, రేపు ఆదివారం కావడం, అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి కావడంతో బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి

  • Written By:
  • Publish Date - September 30, 2023 / 06:04 PM IST

రూ.2 వేల నోట్ల మార్పిడి విషయంలో RBI కీలక ప్రకటన చేసింది. రూ. 2 వేల నోట్ల (2,000 Notes)ను ఉపసంహరించుకుంటున్నట్లు మే 19న ప్రకటించింది RBI. ఈ నోట్లను మార్పిడి లేదా డిపాజిట్ చేసుకునేందుకు 4 నెలల సమయం ఈరోజు (September 30) వరకు సమయం ఇచ్చింది. దీంతో ఖాతాదారులంతా బ్యాంకుల్లో తమవద్ద రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేయడం చేసారు. కానీ చాలామంది చివర్లో చేద్దాం..చివర్లో చేద్దాం అనుకుంటూ కాలయాపన చేసారు. చివరికి ఆ డేట్ వచ్చే సరికి బ్యాంకుల వద్ద బారులు తీరారు.

ఈరోజు పలు బ్యాంకులకు సెలవు ఉండటం, రేపు ఆదివారం కావడం, అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి కావడంతో బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. దాంతో ప్రజలు తమ వద్దనున్న రూ. 2 వేల నోట్లను మార్చుకోవడానికి ఇబ్బంది తలెత్తింది. ఇది గ్రహించిన RBI ఖాతాదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. అక్టోబర్ 7వ (October 07, 2023) తేదీ వరకు రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చునని తెలుపుతూ అధికారిక ప్రకటన చేసింది.

Read Also : Janhvi: హైదరాబాద్ లో జాన్వీ కపూర్ ఖరీదైన ఫ్లాట్‌ ను కొనుగోలు చేసిందా?