Site icon HashtagU Telugu

Ratan Tata – Udyog Ratna : రతన్‌ టాటాకు ‘ఉద్యోగ రత్న’ అవార్డు 

Ratan Tata Udyog Ratna

Ratan Tata Udyog Ratna

Ratan Tata – Udyog Ratna : టాటా గ్రూప్ అంటేనే నమ్మకానికి చిరునామా. అలాంటి టాటా గ్రూప్ రథ సారధి 85 ఏళ్ల రతన్‌ టాటాను మహారాష్ట్ర ప్రభుత్వం ‘ఉద్యోగ రత్న’ అవార్డుతో సత్కరించింది. పారిశ్రామిక, ఉపాధి కల్పనా రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకుగానూ ఆయనకు ఈ పురస్కారాన్ని(Ratan Tata – Udyog Ratna) ప్రదానం చేసింది. దక్షిణ ముంబైలోని కొలాబాలో ఉన్న టాటా నివాసానికి వెళ్లిన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడణవీస్‌, అజిత్‌ పవార్‌ .. రతన్‌ టాటాను కలిసి ఈ పురస్కారాన్ని అందజేశారు. మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరఫున శాలువా, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేసి సన్మానించారు.

Also read : BJP Operation: బీజేపీ సీక్రెట్ ఆపరేషన్.. కమలంలోకి 22 మంది కీలక నేతలు

రతన్‌ టాటాకు ‘ఉద్యోగ రత్న’ పురస్కారం అందించడం ద్వారా ఆ అవార్డుకే మరింత గౌరవం పెరిగిందని సీఎం ఏక్‌నాథ్‌ షిండే అన్నారు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని 100కిపైగా దేశాల్లో టాటా గ్రూపు ఉక్కు నుంచి ఉప్పు దాకా ప్రతి రంగంలో తనదైన ముద్ర వేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటోందని చెప్పారు.

Exit mobile version