Rapido : రోడ్డునపడ్డ ఆటో డ్రైవర్లకు ర్యాపిడో గుడ్‌ న్యూస్‌..

  • Written By:
  • Publish Date - February 14, 2024 / 12:27 PM IST

మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) తీసుకొచ్చిన ఫ్రీ బస్సు (Free Bus) కారణంగా రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్ల (Auto Drivers)కు ర్యాపిడో (Rapido ) గుడ్ న్యూస్ తెలిపింది. ర్యాపిడో ఆటో డ్రైవర్ల నుంచి జీవిత కాలంపాటు ఎటువంటి కమీషన్‌ (Rapido Expands Zero Commission Model ) తీసుకోకుండా సేవలు అందిస్తామని ప్రకటించింది. అయితే డ్రైవర్లు లాగిన్‌ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది. నగరాన్నిబట్టి ఈ రుసుము రోజుకు రూ.9 నుంచి రూ.29 మధ్య ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

గత ఏడాది డిసెంబర్‌లో రాపిడో క్యాబ్‌లను ప్రారంభించి క్యాబ్ బుకింగ్ సేవల రంగంలోకి ప్రవేశించిన ర్యాపిడో క్యాబ్‌ డ్రైవర్‌లకు దాని జీరో-కమీషన్ మోడల్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఆ మోడల్‌ను ఆటో డ్రైవర్లకూ అమలు చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా ర్యాపిడో కో-ఫౌండర్‌ పవర్‌ గుంటుపల్లి మాట్లాడుతూ..ప్రతిరోజు దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది ఆటో రైడ్లు జరుగుతుండగా, వీరిలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌ ద్వారా బుకింగ్‌ చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈ జీరో కమిషన్‌తో ఆఫ్‌లైన్‌ డ్రైవర్లు కూడా ఆన్‌లైన్‌లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ర్యాపిడో రోజుకు 17 లక్షల రైడ్స్‌ నిర్వహిస్తుండగా, ఈ ఏడాది చివరినాటికి 30 లక్షలకు పెంచుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇది ఆటో డ్రైవర్లు మరింత సమర్థవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ అనుభవాన్ని పొందేందుకు అనుమతిస్తుంది.

Read Also : Raging : రామగుండంలో ర్యాగింగ్ కలకలం.. జూనియర్లకు గుండు కొట్టించిన సీనియర్లు