Jaya Prada : జయప్రదకు షాక్ ఇచ్చిన కోర్ట్.. అరెస్ట్‌ కు ఆదేశాలు

  • Written By:
  • Publish Date - February 14, 2024 / 01:11 PM IST

జయప్రద (Jayaprada) ..ఒకప్పుడు చిత్రసీమలో తన అందం, అభినయంతో కోట్ల మంది ప్రేక్షకుల మనసు దోచిన హీరోయిన్. నటిగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఈమె… నటిగా కొనసాగున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కనిపించారు. గత కొంతకాలంగా నటి జయప్రద తవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు, కోడ్ ఉల్లంఘన కేసులు ఆమెను వెంటాడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ (Rampur Court ) ప్రజాప్రతినిధుల కోర్టు జయప్రదను అరెస్ట్‌ చేయాలంటూ నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (Non Bailable Warrant) జారీ చేసింది. గత కొన్నాళ్లుగా ఈ కేసుపై విచారణలు సాగుతుండగా, తాజాగా ఈ మేరకు కోర్టు తీర్పు వెలువరించింది. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదు చేశారు. వాటి విచారణకు ఆమె ఇప్పటి వరకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజాప్రతినిధులు కోర్టు జయప్రద ఎక్కడ ఉన్నా ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేయాలని, ఈ నెల 27వ తేదీన కోర్టులో హాజరు పరచాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ని కోర్టు ఆదేశించింది.

టీడీపీలో ప్రారంభించిన ఆమె రాజకీయ జీవితం తర్వాత యూపీకి చేరింది. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన జయప్రద తర్వాత ఉత్తరాదిలో తన సత్తా చాటుకున్నారు. యూపీలోని సమాజ్ వాది పార్టీలో చేరి రాంపూర్ నుంచి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. తర్వాత బీజేపీలో చేరారు.. ప్రస్తుతం ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె ఎంపీగా ఉన్న సమయంలో ఈఎస్ఐ కి సంబంధించిన కుంభకోణంలో కేసు నమోదైంది.

Read Also : Bidens Removal : బైడెన్‌ను తీసేయండి.. వైస్ ప్రెసిడెంట్ కమలకు అటార్నీ జనరల్ లేఖ