Site icon HashtagU Telugu

Congress : బీజేపీకి షాక్.. కాంగ్రెస్లో చేరిన మనోహర్ లాల్ ఖట్టర్ మేనల్లుడు

Ramit Khattar joined Congress

Ramit Khattar joined Congress

Ramit Khattar joined Congress:   హర్యానాలో బీజేపీకి భారీ షాక్ తగిలింది.  మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మేనల్లుడు రమిత్ ఖట్టర్ గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ విషయాన్ని హర్యానా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ధృవీకరించింది. హర్యానాలోని రోహ్‌తక్‌లో కాంగ్రెస్‌ నాయకుడు, ఎమ్మెల్యే భరత్‌ భూషణ్‌ బన్నా సమక్షంలో రమిత్‌ ఖట్టర్‌ కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకున్నారు. హర్యానా కాంగ్రెస్ యూత్ వింగ్ ఈ సమాచారాన్ని షేర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

హర్యానాలో ఎన్నికలకు ఇంకా 15 రోజుల సమయం మాత్రమే ఉంది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో.. రమిత్ ఖట్టర్ కాంగ్రెస్‌లో చేరడం బీజేపీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఎన్నికలకు ముందు రమిత్ కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. 2020లో డివిజనల్ అటవీ అధికారిని కొట్టిన కేసులో రమిత్ ఖట్టర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అంతే కాకుండా.. ఈ కేసులో రమిత్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తనను కొట్టినప్పుడు రమిత్ ఖట్టర్ కూడా ఉన్నారని అటవీ అధికారి ఆరోపించారు.

Read Also: Heritage : తెలంగాణలో రూ.204 కోట్లతో హెరిటేజ్ భారీ పెట్టుబడులు