NIA: కేఫ్‌లో పేలుడు.. ఘటనపై సమాచారం ఇస్తే రూ.10 లక్షల నగదు : ఎన్‌ఐఏ ప్రకటన

  • Written By:
  • Updated On - March 6, 2024 / 04:43 PM IST

 

NIA: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌ ‌(Rameshwaram Cafe)లో పేలుడు కేసుపై ఎన్‌ఐఏ (National Investigation Agency) అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడి కోసం పలు ప్రాంతాల్లో తీవ్రంగా గాలిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో ఎన్ఐఏ అధికారులు నిందితుడి కోసం రివార్డు (cash reward) ప్రకటించారు. పేలుడుకు పాల్పడిన వ్యక్తి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారికి రూ.10లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. ఈ మేరకు ‘వాంటెడ్‌’ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

read also : Mamata Banerjee: అంగ‌న్‌వాడీ, ఆశా వ‌ర్క‌ర్ల‌ జీతాలు పెంపు..ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్‌ రామేశ్వరం కేఫ్లో శుక్రవారం బాంబ్‌ బ్లాస్ట్ (Bomb Blast) ఘ‌ట‌న చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మాస్క్‌, క్యాప్‌ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌కు వచ్చినట్లు గుర్తించారు. రవ్వ ఇడ్లీని ఆర్డర్‌ చేసుకొని ఒక దగ్గర కూర్చుని.. పేలుడుకు ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. అతడు తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లోని బాంబుకు టైమర్‌ సెట్‌ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ పేలుడు కేసును కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే.