Ramdev Baba: యోగా గురువుకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు…అసలేమైందంటే…!!

యోగా గురువు రాందేవ్ బాబా కోవిడ్ -19 వ్యాక్సిన్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు వేసింది.

  • Written By:
  • Publish Date - August 18, 2022 / 02:42 PM IST

యోగా గురువు రాందేవ్ బాబా కోవిడ్ -19 వ్యాక్సిన్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. అల్లోపతి ఔషధాల చికిత్సలపై దేశ ప్రజలను తప్పుదోవ పట్టించరాదని స్పష్టం చేసింది. కోవిడ్ 1`9 బూస్టర్ డోస్ కెపాసిటి అమెరికా అధ్యక్షుడు జో బైడెట్ వ్యాక్సిన్ తీసుకున్నా కోవిడ్ బారినపడిన అంశంపై మాట్లాడటంపై ఆందోళన వ్యక్తం చేసింది.

రాందేవ్ వ్యాఖ్యలు తప్పుదోవపట్టించేలా ఉన్నాయంటూ కరోనిల్ కోవిడ్ పై పనిచేయదంటూ పలు వైద్యుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు బాబాకు చురకలు అంటించింది. ఇక్కడ వ్యక్తుల పేర్లు ఉపయోగిస్తున్నారు..అది విదేశాలతో దేశ సంబంధాలపై ప్రభావంచూపుతుందని కోర్టు మండిపడింది.

ప్రపంచ నేతల పేర్లను సూచించటం వల్ల వారితో ఉన్న మన సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయని…రాందేవ్ చేసిన ప్రకటన అల్లోపతి ఔషధాలపై ప్రజలను తప్పుదోవప ట్టించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు చెప్పింది నమ్మే వారిని మీరు కలిగిఉండటాన్ని స్వాగతిస్తున్నాం. కానీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొదంటూ జస్టిస్ అనుప్ జైరాం భంభాని పేర్కొన్నారు.

కాగా గతంలో రాందేవ్ బాబా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ భారత వైద్యుల సంఘం ఫిర్యాదు చేసింది. కోవిడ్ ఉగ్రరూపందాల్చిన క్రమంలో కరోనిల్ పై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు బాబాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.