Ramadan: హలీంపై పడిన నిత్యావసర సరకుల ప్రభావం

  • Written By:
  • Publish Date - March 12, 2024 / 01:55 PM IST

రంజాన్ (Ramadan) నెలలో దర్శనమిచ్చే వంటకం హలీం (Haleem). ఉపావాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా ఇష్టంగా కొనుక్కుని తింటారు. దీనిని ఇంట్లో తయారు చేసుకోవడం కొంచెం కష్టమే. రోజంతా ఉపవాస దీక్షలో ఉండి శక్తిని కోల్పోయిన వారు హలీం ద్వారా శరీరంలో కొంత మేరకు శక్తిని పొందగలుగుతారు. రంజాన్‌ వచ్చిందంటే ముస్లింలతోపాటు హిందువులు మతాలకతీతంగా హలీం తినేందుకు ఎదురు చూస్తుంటారు. ఎట్టకేలకు రంజాన్‌ మాసం రావడంతో హలీం కేంద్రాలన్నీ సందడిగా మారాయి. హలీమ్‌ ఎంతో రుచికరంగా ఉంటూ శక్తినీ, ఆరోగ్యాన్నీ అందిస్తుంది. హైదరాబాదీ హలీం భౌగోళిక చిహ్నం (జియోగ్రాఫికల్‌ ఇండికేటర్‌) ని సొంతం చేసుకొంది. అయితే.. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసరుకుల ధరలు ఇప్పుడు హలీం ధరకు ఎసరుపెట్టాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో నిత్యావసర సరకుల ప్రభావం హలీంపై పడింది. దీని తయారీలో ఉపయోగించే మటన్, చికెన్, జీడిపప్పు, నెయ్యి, బియ్యం, వంట నూనె, మసాలాల ధరలు పెరిగాయి. ఫలితంగా గతంలో 350 గ్రాముల మటన్ హలీం రూ.260 ఉండగా.. ప్రస్తుతం దాన్ని రూ.300 నుంచి రూ.330కు విక్రయిస్తున్నారు. అలాగే గతంలో 350 గ్రాముల చికెన్ హలీం రూ. 200కు లభించగా.. ప్రస్తుతం రూ.240 నుంచి రూ.270కు విక్రయిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఎన్నికల సమయంలో ముఖ్యంగా ఉల్లిపాయల నుండి టమోటాల నుండి పప్పుల వరకు నిత్యావసర ఆహార పదార్థాల ధరలు పెరగకుండా చూసేందుకు కేంద్రం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. “మా నారీ-శక్తి” యొక్క గృహ బడ్జెట్‌పై ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండేలా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంటుందని నొక్కి చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైనప్పుడు ఆహార పదార్థాల ధరలు పెరగకుండా చూసేందుకు ప్రభుత్వ వ్యూహం గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, “మేము దానిలో అగ్రస్థానంలో ఉండబోతున్నాము. మరియు నేను భారతదేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఈ ప్రభుత్వం భారతదేశంలోని మహిళల పట్ల శ్రద్ధ వహిస్తుంది.
Read Also : TSRTC : ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ కీలక నిర్ణయం..!