Site icon HashtagU Telugu

Writer Bhagawan: రాముడు తన భార్య సీతతో కలిసి వైన్ తాగేవాడు.. కేఎస్ భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

KS Bhagwan

Aa16zmsc 11zon

రాముడు ప్రతిరోజు మధ్యాహ్నం తన భార్య సీతతో కలిసి కూర్చుని వైన్ తాగేవాడని వాల్మీకి రామాయణం చెబుతోందని ప్రముఖ రచయిత, హేతువాది కేఎస్ భగవాన్ (KS Bhagawan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీతతో కూర్చుని ద్రాక్షారసం సేవించడం రాముడి ప్రధాన కార్యకలాపామన్నారు. ఇది తాను చెప్పడం లేదని, ఆ పత్రాలు చెబుతున్నాయని తెలిపారు. కర్ణాటకలోని మండ్య జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో భగవాన్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

గురువారం మండ్య జిల్లా కేఆర్‌పేట్‌లో ఎన్‌ఎం తిమ్మేగౌడ రచించిన ఏడు పుస్తకాలను విడుదల చేసిన అనంతరం భగవాన్ మాట్లాడుతూ.. రామరాజ్యం నిర్మాణం గురించి చర్చ జరుగుతోందని, ఈ ఆలోచనను ప్రచారం చేయడానికి మహాత్మాగాంధీ కారణమని అన్నారు. వాల్మీకి రామాయణంలోని ఉత్తర కాండ చదివితే రాముడు ఆదర్శం కాదని తేలిపోతుంది. అతను 11,000 సంవత్సరాలు పాలించలేదు, 11 సంవత్సరాలు మాత్రమే. అతను పగటిపూట కొంతమంది పూజారులతో కబుర్లు చెప్పుకునేవాడు. మధ్యాహ్నం సీతతో కూర్చుంటాడు. వారిద్దరూ మిగిలిన రోజంతా తాగుతూ గడిపేవారు అని భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: Foreign Trip Tips : మీరు మొదటిసారి విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా?

కేఎస్ భగవాన్ శ్రీరాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇదేమి తొలిసారి కాదు. 2019లో కూడా ఇలానే మాట్లాడాడు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు మత్తు పదార్థాలు తాగేవాడని, సీతను కూడా తాగేలా చేశాడని పేర్కొంటూ అప్పట్లో పెద్ద వివాదానికి తెరలేపారు. ఆయన రాసిన ‘రామ మందిర యాకే బేడా’ పుస్తకంలో కేఎస్ భగవాన్ ఈ విషయాలను పేర్కొన్నారు.