RBI Declares Holiday: ఆర్‌బీఐ భారీ ప్రకటన.. జ‌న‌వ‌రి 22న రూ. 2000 నోటును మార్చుకోవ‌టం సాధ్యం కాదు.. ఎందుకంటే..?

జనవరి 22, సోమవారం నాడు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలు సగం రోజు హాఫ్ డే హాలిడే ఉండటంతో 2000 రూపాయల నోట్లను మార్చుకునే సౌకర్యం అందుబాటులో ఉండదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI Declares Holiday) తెలియజేసింది.

Published By: HashtagU Telugu Desk
RBI Declares Holiday

RBI extends deadline to exchange

RBI Declares Holiday: జనవరి 22, సోమవారం నాడు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలు సగం రోజు హాఫ్ డే హాలిడే ఉండటంతో 2000 రూపాయల నోట్లను మార్చుకునే సౌకర్యం అందుబాటులో ఉండదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI Declares Holiday) తెలియజేసింది. రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమం దృష్ట్యా సోమవారం కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సగం రోజు సెలవును సిబ్బంది, శిక్షణ శాఖకు ప్రకటించింది. దీని కారణంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, బీమా కంపెనీలు, అన్ని ఆర్థిక సంస్థలు హాఫ్ డే మూతపడనున్నాయి.

జనవరి 22న రూ.2000 నోట్లను మార్చుకోవడానికి వీల్లేదు

శుక్రవారం ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రభుత్వ రంగ బ్యాంకుల మాదిరిగానే రిజర్వ్ బ్యాంక్ 19 స్థానిక కార్యాలయాలకు సగం రోజుల సెలవు ఉంటుందని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున వినియోగదారులు రూ.2000 నోట్లను మార్చుకోలేరు. దీనితో పాటు ఈ సదుపాయం జనవరి 23, 2024 నుండి సాధారణంగా ప్రారంభమవుతుందని బ్యాంక్ తెలియజేసింది.

2000 రూపాయల నోట్లు చెలామణి అయిపోయాయి

2023 మే 19న రూ.2000 నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఆ సమయంలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉండగా డిసెంబర్ 29, 2023 నాటికి రూ.9,330 కోట్లకు తగ్గింది. డిసెంబర్ చివరి వరకు ప్ర‌జ‌ల వ‌ద్ద‌ మొత్తం 2.62 శాతం రూ. 2000 నోట్లు ఉన్నాయి. అవి ఇప్పటికీ బ్యాంకు చలామణిలో లేవు.

Also Read: Samantha: హనుమాన్ మూవీపై సమంత ప్రశంసల జల్లు

19 చోట్ల నోట్లను మార్చుకోవచ్చు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 అక్టోబర్ 8 వరకు బ్యాంకులు, పోస్టాఫీసులలో రూ.2000 నోట్లను మార్చుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ కాలంలో ఎవరైనా నోట్లను మార్చుకోవడంలో విఫలమైతే వారు 19 ప్రదేశాలలో ఉన్న రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాలను సందర్శించడం ద్వారా నోట్లను మార్చుకోవచ్చు. న్యూఢిల్లీ, పాట్నా, లక్నో, ముంబై, భోపాల్, జైపూర్, చండీగఢ్, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, తిరువనంతపురం, నాగ్‌పూర్ వంటి ఆర్‌బీఐ కార్యాలయాల్లో నోట్ల మార్పిడి సౌకర్యం అందుబాటులో ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 22న సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881లోని సెక్షన్ 25 ప్రకారం సెలవు ప్రకటించింది. ఈ నిర్ణయం తర్వాత సోమవారం ప్రైమరీ, సెకండరీ ప్రభుత్వ సెక్యూరిటీలు, మనీ మార్కెట్లు, రూపాయి వడ్డీ రేటు డెరివేటివ్‌లలో ఎలాంటి లావాదేవీలు ఉండవు. జనవరి 23 నుండి అన్ని రకాల లావాదేవీలు సాధారణంగా చేయవచ్చు.

  Last Updated: 20 Jan 2024, 08:12 AM IST