Ram Mandir Inauguration: రామ మందిర ప్రతిష్ట (Ram Mandir Inauguration)కు సంబంధించి పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాల్లో హాఫ్ డే సెలవు ప్రకటించారు. ప్రాణ ప్రతిష్ఠ రోజున మాంసం, మద్యం దుకాణాలకు కూడా తాళాలు వేయనున్నారు. గోవాలోని కాసినోలు కూడా జనవరి 22న మూసివేయబడతాయి. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌తో సహా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నాలుగు ఆసుపత్రులు మధ్యాహ్నం 2.30 గంటల వరకు మూసివేయబడతాయి.
అయితే ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు కొనసాగుతాయి. ఈ కాలంలో ఏ పేషెంట్ ఎమర్జెన్సీ కండిషన్ లో వచ్చినా వెంటనే చికిత్స కూడా అందిస్తారు. అయితే సాధారణ ఓపీడీలు మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత తెరుచుకోనున్నాయి. ప్రాణ ప్రతిష్ట రోజున ఏ రాష్ట్రంలో సెలవు ఉంటుంది..? ఏ రాష్ట్రంలో ఏమి మూసివేయబడుతుందో తెలుసుకుందాం.
మద్యం, మాంసం దుకాణాలు ఎక్కడ క్లోజ్ చేయనున్నారు?
ప్రాణ ప్రతిష్ఠా రోజున రాష్ట్రంలో మద్యం, మాంసం దుకాణాలను మూసివేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో మద్యం, మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మధ్యప్రదేశ్, హర్యానా కూడా మద్యం, మాంసం దుకాణాలకు తాళం వేయబడే రాష్ట్రాల్లో ఉన్నాయి. హర్యానాలో కూడా మద్యం దుకాణాలు తెరవబోమని, మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది. అదే సమయంలో ఉత్తరాఖండ్, గుజరాత్‌లలో కూడా మద్యం, మాంసం దుకాణాలు మూసివేయబడతాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఏయే రాష్ట్రాల్లో సెలవులు ఉంటాయి?
– త్రిపుర: త్రిపురలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు జనవరి 22 మధ్యాహ్నం 2:30 వరకు మూసివేయబడతాయి.
– ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు జనవరి 22 మధ్యాహ్నం 2:30 గంటల వరకు మూసివేయబడతాయి. పాఠశాలలు, కళాశాలలకు పూర్తి రోజు సెలవు.
– ఉత్తరప్రదేశ్: యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అన్ని పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.
– మధ్యప్రదేశ్: ఎంపీలోని పాఠశాలలకు పూర్తి సెలవు ప్రకటించగా, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలలో సగం రోజు ఉంటుంది.
– గోవా: గోవా ప్రభుత్వం జనవరి 22న ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
– హర్యానా: రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో హాఫ్ డే ఉండగా, పాఠశాలలు, కళాశాలలకు పూర్తి రోజు సెలవు ఉంటుంది.
– ఒడిశా: ఒడిశా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హాఫ్ డే ప్రకటించారు.
– అస్సాం: అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అసోం ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో హాఫ్ డే ప్రకటించింది.
– రాజస్థాన్: ప్రాణ ప్రతిష్ట రోజున రాజస్థాన్‌లో హాఫ్ డే ప్రకటించారు. ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాలకు సగం రోజు సెలవు ఉంటుంది.
– గుజరాత్: ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో మధ్యాహ్నం 2.30 గంటల వరకు సగం రోజు సెలవు ఉండే రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఉంది.
– చండీగఢ్: కేంద్ర పాలిత ప్రాంత పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రోజంతా సెలవులు ఉండాలని నిర్ణయించింది.
– ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ ప్రభుత్వం పాఠశాలలు, విద్యాసంస్థల్లో హాఫ్ డే ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు కూడా సగం రోజు మూతపడనున్నాయి.
– మహారాష్ట్ర: ప్రాణ ప్రతిష్ఠా పర్వదినాన మహారాష్ట్రలో ప్రభుత్వ సెలవు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు మూసివేయబడతాయి.
– పుదుచ్చేరి: ప్రాణ ప్రతిష్ట సందర్భంగా పుదుచ్చేరిలో జనవరి 22న ప్రభుత్వ సెలవు దినంగా కేంద్రపాలిత ప్రాంతం కూడా నిర్ణయించింది.
– ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలన్నింటికి సగం రోజు సెలవు ఇవ్వనున్నారు. ఢిల్లీలోని కొన్ని విద్యాసంస్థల్లో కూడా హాఫ్ డే ఉంటుంది.