ప్రస్తుతం మణిపూర్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటన దేశాన్ని మాత్రమే కాదు.. రాజ్యసభను సైతం దద్దరిల్లేలా చేస్తోంది. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతూ సభాధ్యక్షుని కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన సభ్యుడు సంజయ్ సింగ్ ను ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ జగదీప్ ధనఖడ్ ప్రకటించారు. సభా మర్యాదలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ని సస్పెండ్ చేయాల్సిందిగా అధికార పక్షం నుండి సభా నాయకుడు పీయూష్ గోయల్ ప్రతిపాదించగా, సభ మూజువాణి ఓటుతో దానిని ఆమోదించింది. తదనంతరం సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
ఒకవైపు మనదేశంలో మణిపూర్ ఘటన మంటలు రేపుతుండగా, మరోవైపు అగ్రరాజ్యమైన అమెరికా సైతం స్పందించింది. అమెరికాలోని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి ఈ సంఘటనను క్రూరమైనది, భయంకరమైనదిగా అభివర్ణించారు. అలాగే అమెరికా తరఫున బాధితులకు సానుభూతి తెలిపారు. కాగా మణిపూర్‌లో గిరిజన మహిళలపై జరిగిన అమానవీయ సంఘటనకు బాధ్యతవహిస్తూ మణి పూర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ఆదివాసీ మహిళ రాష్ట్రప్రధాన కార్యదర్శి ఆత్రం సుగుణ డిమాండ్ చేశారు. మండలంలో మణిపూర్ ఘటనపై నిరసిస్తూ దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో పలు చోట్లా రాస్తారోకో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆత్రం సుగుణ మాట్లాడుతూ మణిపూ ర్‌లో గిరిజన మహిళలపై జరుగుతున్న అరాచాకాల వెనుక బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉందని ఆరోపించారు. ఆదివాసీ సంఘం నాయకులు కనకయాదవ్‌రావ్, కనక వెంకటేష్ మాట్లాడుతూ తాము అడవిబిడ్డ లైన కుమరంభీం, బీర్సా ముండ, అంబేద్కర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులమని చావుకైన సిద్ధంగా ఉన్నామని, కాని ఆత్మ గౌరవాన్ని మాత్రం చంపుకోబోమని హెచ్చ రించారు. అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కాంబ్లే అన్నారావ్, కాంబ్లే అశోక్ సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు మడావి భీంరావ్, కుడ్మెత విశ్వనాథ్, తదితరులు ఉన్నారు.
Also Read: Indigo Video: యుద్ధ వీరుడికి ఇండిగో అపూర్వ స్వాగతం, తోటి ప్రయాణికులు చప్పట్లు