Site icon HashtagU Telugu

Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ

Rajya Sabha

Rajya Sabha

Rajya Sabha Elections : కేంద్ర ఎన్నికల కమిషన్ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లోని  56  రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.  ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని తెలిపింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఫిబ్రవరి 15ను లాస్ట్ డేట్‌గా ఈసీ డిసైడ్ చేసింది. ఉదయం 10 గంటల నుంచి రాజ్యసభకు సంబంధించి నామినేషన్లను(Rajya Sabha Elections) స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 16న జరుగుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.  ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. ఓటింగ్‌ పూర్తయిన తర్వాత అదే రోజు (ఫిబ్రవరి 27) సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలకు, బిహార్‌లో 6, మహారాష్ట్రలో 6, పశ్చిమబెంగాల్‌లో 5, మధ్యప్రదేశ్‌‌లో 5, గుజరాత్‌‌లో 4, కర్ణాటకలో 4, ఒడిశా, రాజస్థాన్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లలో మూడేసి చొప్పున స్థానాలకు ఎన్నిక  జరగనుంది. హరియాణా, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌‌లలో  ఒక్కో రాజ్యసభ స్థానానికి పోలింగ్‌ జరగనుంది.

We’re now on WhatsApp. Click to Join.

తెలుగు రాష్ట్రాల్లో పోటీ ఇలా.. 

తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమెడల రవీంద్ర కుమార్ రిటైర్ అవుతున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, లింగయ్య యాదవ్,  సంతోష్ ఎంపీలు రిటైర్‌ కానున్నారు. ఏప్రిల్ 4 తో వీరందరి పదవీకాలం ముగుస్తుంది.  ఏపీ నుంచి ముగ్గురు రాజ్యసభ అభ్యర్దులు గెలవాలంటే ఒక్కో అభ్యర్దికి 58 ఓట్లు కావాల్సి ఉంటుంది. ఇక, ఇప్పుడు ఏపీలో రెండు పార్టీల నుంచి 9 మంది పైన అనర్హత పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. గంటా రాజీనామా ఆమోదించారు. దీంతో ఈ పది మంది పైన స్పీకర్ నిర్ణయం తీసుకుంటే సభలో సంఖ్య బలం 165కి చేరుతుంది. అప్పుడు ఒక్కో రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే 55 మంది చొప్పున మద్దతు అవసరం. వైసీపీ నుంచి రాజ్యసభకు కొత్తగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, అరణి శ్రీనివాసులకు అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. దీని ద్వారా రెడ్డి, ఎస్సీ, బలిజ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు.

Also Read :Fatwa Against Imam : రామమందిర కార్యక్రమానికి హాజరైన ఇమామ్‌కు వ్యతిరేకంగా ఫత్వా

Exit mobile version