Rajya Sabha Elections 2024: హిమాచల్‌లో సమాన ఓట్లు.. ఓటమి అంగీకరించిన కాంగ్రెస్

హిమాచల్ ప్రదేశ్‌లోని రాజ్యసభ స్థానానికి ఈరోజు రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఉదయం నుంచి రాష్ట్రంలో క్రాస్‌ ఓటింగ్‌పై రాజకీయ వాతావరణం నెలకొంది. కొద్దీసేపటి క్రితమే ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి.

Published By: HashtagU Telugu Desk
Rajya Sabha Elections 2024

Rajya Sabha Elections 2024

Rajya Sabha Elections 2024: హిమాచల్ ప్రదేశ్‌లోని రాజ్యసభ స్థానానికి ఈరోజు రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఉదయం నుంచి రాష్ట్రంలో క్రాస్‌ ఓటింగ్‌పై రాజకీయ వాతావరణం నెలకొంది. కొద్దీసేపటి క్రితమే ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. నిజానికి ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయి. ఫైనల్ గా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిని అంగీకరించారు.

హిమాచల్ ప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్‌ మహాజన్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ మను సింఘ్వీలకు సమాన ఓట్లు వచ్చాయి. క్రాస్ ఓటింగ్ ఊహాగానాల మధ్య, ఈ ఓటు సంఖ్య బిజెపికి చాలా ముఖ్యమైనది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు 34-34 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి సింఘ్వీ ఓటమిని అంగీకరించారు.

హిమాచల్‌ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ విజయం సాధించారు. మరోవైపు రాజ్యసభలో అభ్యర్థులిద్దరికీ సమాన ఓట్లు వచ్చాయని ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్ అన్నారు. ఈ విజయం దృష్ట్యా హిమాచల్ ప్రదేశ్ సీఎం తన పదవికి రాజీనామా చేయాలని, కేవలం ఒక్క సంవత్సరంలోనే ఎమ్మెల్యేలు తనను వదిలిపెట్టారని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి హర్ష్ మహాజన్ విజయం సాధించారని రాష్ట్ర బీజేపీ ప్రకటించింది.

Alsoo Read: Vegetable Pancake: పిల్లలు ఎంతగానో ఇష్టపడే కూరగాయల పాన్ కేక్.. ఇలా చేస్తే లొట్టలు వేసుకొని మరి తినేస్తారు?

  Last Updated: 27 Feb 2024, 08:41 PM IST