Site icon HashtagU Telugu

Rajnath Singh: సియాచిన్ లో రాజ్ నాథ్ సింగ్ పర్యటన.. సైనిక సంసిద్ధతపై రివ్యూ

Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్ ను సోమవారం  రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విజిట్ చేశారు.  కీలకమైన సియాచిన్ లో భారత సైన్యం 40వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వారం రోజుల తర్వాత రాజ్ నాథ్ సింగ్ సియాచిన్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో కలిసి రక్షణ మంత్రి ఈ ప్రాంతంలోని మొత్తం భద్రతా పరిస్థితిని సమీక్షించారు.  సియాచిన్ లో మోహరించిన సైనికులతో సింగ్ సంభాషించారు.

అధిక గాలులతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సైనిక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ‘ఆపరేషన్ మేఘదూత్’ కింద భారత సైన్యం 1984 ఏప్రిల్ నుంచి సియాచిన్ వేదికగా నిర్ణయాలు తీసుకుంటోంది. గత ఏడాది జనవరిలో ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ కు చెందిన కెప్టెన్ శివ చౌహాన్ సియాచిన్ గ్లేసియర్ లోని ఫ్రంట్ లైన్ పోస్టులో విధులు నిర్వర్తించారు. “సియాచిన్ హిమానీనదంపై భారత సైన్యం విధులు నిర్వహించడం చాలా కష్టసాధ్యమైనప్పటికీ సైనికులు పరిస్థితులను తట్టుకుంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఇది అత్యంత బలీయమైన భూభాగాలలో ఒకటి.