భారత్‌పై కుట్రలు చేస్తున్న పాకిస్థాన్‌కు మరోసారి గట్టిగా హెచ్చరిక జారీ చేసారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh). దేశ భద్రతను లైట్ గా తీసుకునే వారికి భారత్ (India) సమాధానం చెప్పేది మాటలతో కాదు, చేతలతో అని స్పష్టం చేశారు. భారత్‌పై దాడులు చేస్తే ఉక్కు పంజా ఎలా ఉంటుందో చూపిస్తామని, ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ (Modi) పని తీరు, పట్టుదల గురించి బాగా తెలుసని పేర్కొన్నారు. చైనాతో కలసి భారత్‌పై కుట్రలు పన్నే వారికి ఊహించని విధంగా ఎదురు దాడి జరుగుతుందన్నారు.
Igla S Missiles: టార్గెట్ పీఓకే.. ‘ఇగ్లా-ఎస్’లను రంగంలోకి దింపుతున్న భారత్
ఇక పాకిస్థాన్‌కు ముస్లిం దేశాల నుంచి మద్దతు కరువవుతోంది. అంతర్జాతీయంగా పాక్ ఒంటరిగా మారిపోతుంది. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ వంటి ముఖ్యమైన ముస్లింల దేశాలు పాక్‌కు మద్దతివ్వడాన్ని తీవ్రంగా తగ్గించాయి. ఇవి భారత్‌తో వ్యాపార సంబంధాల దృష్ట్యా భారత వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ దృష్ట్యా ముస్లిం దేశాల నుంచి పాక్‌కు అండ తగ్గిపోవడం, పాక్‌కు రాజనీతికంగా, ఆర్థికంగా గట్టి ఎదురుదెబ్బగా మారింది. ఇది భారత్‌కు ఒక బలంతో పాటు, అంతర్జాతీయ మద్దతుగా మారుతోంది.
మరోవైపు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌తో వాయుసేన స్థాయిలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. భారత రఫేల్ యుద్ధవిమానాలు తమ గగనతలంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించాయని, వాటిని పాక్ వైమానిక దళం అడ్డుకుందని చెప్పారు. పాక్ మీడియా సంస్థ ARY Newsకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించారు. కానీ భారత్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాకపోవడంతో పాక్ ఈ వ్యాఖ్యలు కావాలనే ప్రచారం చేస్తుందని అంటున్నారు.