Russia : భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా రష్యా నిర్వహించనున్న విక్టరీ డే వేడుకల్లో హాజరు కాకపోవచ్చు తెలుస్తోంది. అయితే ఈ వేడుకలకు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్‌ను పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ముందుగా ఈ ఈవెంట్‌కు ప్రధాని మోడీ వెళ్లాల్సి ఉంది. అయితే, ఉగ్రదాడితో మాస్కో పర్యటనను ప్రధాని రద్దు చేసుకున్నారు. ఈవెంట్‌కు ప్రధాని మోడీ రావట్లేదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వెల్లడించింది. మోడీ పర్యటన రద్దుతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఈ విక్టరీ డే వేడుకల్లో పాల్గొంటారని వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో ఆయన కూడా వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. దీంతో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్‌ను పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also: Poonam Gupta: ఆర్బీఐలో డిప్యూటీ గవర్నర్ పాత్ర ఏంటీ? ఈఎంఐలు నిర్ణయిస్తారా!
ఇక, రెండో ప్రపంచయుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా మే 9న రష్యా విక్టరీ డే పరేడ్ నిర్వహిస్తుంది. మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో భారీ స్థాయిలో సైనిక కవాతు నిర్వహిస్తారు. 80వ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి మిత్ర దేశాధినేతలను పుతిన్ ఆహ్వానించారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మోడీకి ఆహ్వానం అందింది. ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మోడీ తన రష్యా పర్యటనను రద్దు చేసుకున్నారు.
కాగా, జనవరి 1945లో, సోవియట్ సైన్యం జర్మనీపై దాడిని ప్రారంభించింది. మే 9న కమాండర్లు-ఇన్-చీఫ్ జర్మనీ యొక్క బేషరతు లొంగిపోయే చట్టంపై సంతకం చేశారు. ఇది యుద్ధాన్ని ముగించింది. తన గత పర్యటన సందర్భంగా, మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను భారతదేశానికి సందర్శించమని ఆహ్వానించారు. మరియు రెండు దేశాల నాయకుల మధ్య పరస్పర వార్షిక నిశ్చితార్థాల కోసం ఏర్పాటు చేసిన చర్చలో భాగంగా ఈ సంవత్సరం ఆయన భారతదేశానికి వస్తారని భావిస్తున్నారు. అయితే, పుతిన్ పర్యటన తేదీలు ఇంకా ప్రకటించబడలేదు.
Read Also: Summer Holidays : 5 నుంచి తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు