Rajasthan: ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగం కట్

ఇద్దరు పిల్లలే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ప్రమాణాలు అనే రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివక్షతో కూడుకున్నది కాదని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది

Rajasthan: ఇద్దరు పిల్లలే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ప్రమాణాలు అనే రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివక్షతో కూడుకున్నది కాదని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులని అక్కడి గవర్నమెంట్ పేర్కొంది.

జూన్ 1న లేదా ఆ తర్వాత ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగానికి నియామకానికి అర్హులు కాదని రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్, 1989లోని రూల్ 24 (4) పేర్కొంటున్నదని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ నిర్ణయం వివక్షత లేనిదని ధర్మాసనం పేర్కొంది.కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడమే ఈ నిబంధన వెనుక ఉద్దేశమని సుప్రీంకోర్టు పేర్కొంది.

Also Read: Shock to BRS: ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా?