ఆ మంత్రి వివాదస్పద కామెంట్స్…బీజేపీ నేతలు రామభక్తులు కాదు..రావణాసురుడి భక్తులు..!!

రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియావాస్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఇంధన ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Minister Jai Pratap Singh

Minister Jai Pratap Singh

రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియావాస్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఇంధన ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నేతలు రాముడి భక్తులు కాదు…రావణుడికి భక్తులంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జైపూర్ లో మంత్రి ప్రతాప్ సింగ్ పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల గురించి మాట్లాడారు. ది కశ్మీర్ ఫైల్స్ మూవీ కోసం ఎలా టికెట్లను పంచిపెడుతున్నారో…ఆవిధంగానే పెట్రోలు, డిజిల్ కోసం కూడా కూపన్లను పంచి పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు.

బీజేపీ నేతలు రాముడి భక్తులు చెప్పుకుంటారని…కానీ రాముడి విధానాన్ని పాటించడం లేదు..రావణుడి పాలసీని పాటిస్తున్నారన్నారు. రావణుడు ఓ మోసగాడు…నీ రాముడు ఎవర్నీ మోసం చేయలేదని..ప్రతి ఒక్కర్నీ రాముడు సమానంగా చూశాడంటూ బీజేపీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పెట్రోల్, డీజిల్ రేట్లను పదే పదే పెంచుకుంటుపోతున్నారని…ఇది సామాన్య ప్రజలకు గుదిబండగా మారుతోందని…కానీ బీజేపీకి ఇదేం పట్టదని ధ్వజమెత్తారు. గత వారం రోజుల్లో పెట్రోల్, డీజీల్ రేట్లు ఏడుసార్లు పెంచారన్నారు. సోమవారం కూడా పెట్రోలు 90, డిజిల్ పై 76 పైసలు పెంచారన్నారు. గడిచిన ఎనిమిది రోజుల్లో పెట్రోలు ధరలు పెంచడం ఇది ఏడోసారి. ఇలా పెంచుకుంటూ పోవడం ఎంత వరకు మంచిది. సామాన్యుల కష్టాలు మీకేం తెలుస్తాయంటూ విమర్శలు సంధించారు. అటు మంగళవారం కూడా ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో లీటర్ వంద మార్కును దాటేసింది.

  Last Updated: 29 Mar 2022, 12:48 PM IST