Site icon HashtagU Telugu

Raping Stepdaughter: రాజస్థాన్‌లో దారుణం.. సవతి కూతురి మీద తండ్రి అత్యాచారం

Rape Imresizer

Rape Imresizer

రాజస్థాన్‌లోని కోటాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి గత కొన్ని నెలలుగా తన సవతి కుమార్తె (Raping Stepdaughter)పై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ మేరకు ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ మేరకు బుధవారం పోలీసులు సమాచారం అందించారు. ప్రాథమిక విచారణ అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌హెచ్‌ఓ అమర్‌నాథ్ తెలిపారు.

చనిపోయిన తన తల్లి తరపు బంధువులతో కలిసి బాధితురాలు ఆదివారం పోలీస్ స్టేషన్‌ ను ఆశ్రయించిందని, తన సవతి తండ్రిపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిందని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. గత 3-4 నెలలుగా తన సవతి తండ్రి తనపై పదేపదే అత్యాచారం చేస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని మైనర్ తెలిపింది. తల్లి చనిపోయిన తరువాత ఆమె స్కూల్ మానేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. వేధింపులు భరించలేక మైనర్ గతవారం సవతి తల్లిదండ్రుల ఇంటి నుండి తప్పించుకుంది. ఈ క్రమంలో ఓ పోలీసు కానిస్టేబుల్ ను ఆమె కలిసింది. అతని సహాయంతో ఆమె తల్లి తరుపు బంధువు ఇంటికి చేరుకుంది.

Also Read: Actress Abhinaya: సీనియర్ నటికి రెండేళ్ల జైలు శిక్ష.. కారణమిదే..?

ఈ కేసులో పోలీసులు పోక్సో, ఎస్సీ/ఎస్టీ, జువైనల్ యాక్ట్ సహా కనీసం 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ఎదుట అదే రోజు వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. నిందితుడికి నేర చరిత్ర ఉంది. దశాబ్దం క్రితం అతను బాధితురాలి తల్లితో పారిపోయాడు. ఆ తరువాత అతను పెట్టే హింసలకు తట్టుకోలేక ఆమె చనిపోయింది. ఆ తర్వాత మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని అధికారి తెలిపారు.