Site icon HashtagU Telugu

Rajasthan: రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత సెల్ ఫోన్లు, ఇంటర్నెట్..!!

Ashok Gehlot

Ashok Gehlot

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోసం రాజస్థాన్ లోని అశోక్ గెహ్లాట్ సర్కార్ ఇప్పటి నుంచే ప్లాన్స్ రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా ఓ సరికొత్త పథకాన్ని తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో అర్హులైన 1.35కోట్ల మంది మహిళలు ఫ్రీగా సెల్ ఫోన్ల పంపిణీ చేయడంతోపాటుగా 3ఏళ్ల పాటు ఫ్రీగా ఇంటర్నెట్ సదుపాయం కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది బడ్జెట్ లో డిజిటల్ సేవా యోజన పథకాన్ని ముఖ్యమంత్రి గెహ్లాట్ ప్రకటించారు. దీనిలో భాగంగానే తాజాగా ఈ ప్రకటన చేసిన గెహ్లాట్…దీనికోసం మొత్తం రూ. 12వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది.

ఇక ఈ పథకంలో భాగంగా చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం పేరుతో సర్కార్ అందిస్తున్న ఆరోగ్య బీమా పథకంలో చేరినకుటుంబాల్లోని మహిళలకు ఫ్రీగా సెల్ ఫోన్లు అందిస్తారు. మూడేళ్లపాటు ఫ్రీగా ఇంటర్నెట్ కూడా అందిస్తారు. అర్హులైనవారిని1.5 కోట్లుగా లెక్క తేల్చింది సర్కార్. డ్యూయల్ సిమ్ ఫోన్లు అయిన ఇందులో ఓ సిమ్ కార్డు లాక్ చేసి ఉంటుంది. రెండో స్లాట్ లో మాత్రం మరోకార్డు వేసుకోవచ్చు. ఇక ఈ పథకంలో భాగంగా సేవలు అందించేందుకు టెలికం సంస్థ నుంచి బిడ్లు కూడా ఆహ్వానించింది. దీనికోసం bsnlతోపాటు మూడు ప్రైవేట్ టెలికం కంపెనీలు పోటీలో ఉన్నాయి.

Exit mobile version