రాజస్తాన్ (Rajasthan ) లో పెళ్లిళ్ల ఎఫెక్ట్ తో ఎన్నికల పోలింగ్ (Rajasthan Assembly Polling date) తేదీని ఈసీ మార్చేసింది. తాజాగా ఎన్నికల కమిషన్ తెలంగాణతో పాటు మరో నాల్గు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ లో నవంబర్ 30 న , మధ్య ప్రదేశ్ లో నవంబర్ 17 న , రాజస్థాన్ నవంబర్ 23 న , ఛత్తీస్‌గఢ్ లో నవంబర్ 07 , 17 న , మిజోరం లో నవంబర్ 07 న ఎన్నికలు జరగనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది. కాగా రాజస్థాన్ (Rajasthan) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 23 (November 23) వ తేదీన జరగనుంది. అయితే అదే రోజు దేవ్ ఉథాని ఏకాదశి (Dev Uthani Ekadashi) కావడం గమనార్హం. నవంబర్ 23 వ తేదీన రాజస్థాన్ వ్యాప్తంగా 50 వేల కంటే ఎక్కువ వివాహాలు జరగబోతున్నాయి. అయితే ఎన్నికల పోలింగ్, ఎన్నికల కోడ్ ఆంక్షలతో పెళ్లిళ్లు చేసుకునేవారితోపాటు వాటికి హాజరయ్యేవారికి తీవ్ర ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం కావడం తో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చింది ఈసీ. నవంబర్ 23న కాకుండా రాష్ట్రంలో నవంబర్ 25 న పోలింగ్ జరపనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
నవంబర్ 23న రాజస్థాన్ లో భారీ సంఖ్యలో పెండ్లిండ్లు, సామాజిక కార్యక్రమాలు జరగనున్నట్టు, ఈ కారణంగా చాలామంది పోలింగ్‌కు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయా పార్టీలు, సంస్థలు తమకు వివరించినట్టు ఈసీ పేర్కొంది. అందుకే పోలింగ్ తేదీని మారుస్తున్నట్లు పేర్కొంది. డిసెంబర్ 3న మాత్రం యథావిధిగా ఫలితాలు వెలువడనున్నాయి.
Read Also : AP High Court : ఎస్సై నియామకాలపై ఏపీ హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్