Rajasthan Polling : రేపే రాజస్థాన్‌ పోలింగ్.. టాప్ పాయింట్స్ ఇవే

Rajasthan Polling :  రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపే(శనివారం).

Published By: HashtagU Telugu Desk
Rajasthan Polling

Rajasthan Polling

Rajasthan Polling :  రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపే(శనివారం). దాదాపు గత నెలన్నర రోజులుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రం 6గంటలకు తెరపడింది. ఈనేపథ్యంలో ఆ రాష్ట్ర ఎన్నికలతో ముడిపడిన టాప్  పాయింట్స్‌ను ఇప్పుడు చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join.

  • రాజస్థాన్‌లో 200 నియోజకవర్గాలు ఉండగా.. 199 స్థానాలకు ఒకేరోజు పోలింగ్‌ జరగనుంది.
  • రాష్ట్రంలో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు, 51,756 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
  • రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రూ.682 కోట్ల విలువైన సొత్తును సీజ్ చేశారు.
  • డిసెంబర్ 3న ఎన్నికల రిజల్ట్ రిలీజ్ అవుతుంది.
  • మొత్తం 1875 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో 183 మంది స్త్రీలు, 1692 మంది పురుషులు.
  • జోత్వారా అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యధికంగా 18 మంది, లాల్సోట్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో నుంచి అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
  • 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 99, బీజేపీ 73 సీట్లను గెల్చుకున్నాయి.
  • అబు పింద్వారా అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 4,921 అడుగుల ఎత్తైన ప్రదేశంలో ఉన్న  షేర్‌గావ్ ప్రజలు స్వగ్రామంలోని పోలింగ్ బూత్‌లో రేపు ఓటు వేయబోతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారు తమ ఊరిలోనే ఓటువేయడం ఇదే తొలిసారి.
  • 35 మంది ఓటర్లున్న బార్మర్ కా పార్, 49 మంది ఓటర్లు ఉన్న మంఝోలి, 50 మంది ఓటర్లున్న కంటల్ కా పార్ గ్రామాల్లోనూ ఈసారి పోలింగ్ కేంద్రాలు(Rajasthan Polling) ఏర్పాటు చేశారు.

Also Read: Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఎక్కువ టార్గెట్ ను అత్యధిక సార్లు ఛేదించిన జట్టుగా భారత్..!

  Last Updated: 24 Nov 2023, 09:00 AM IST