Site icon HashtagU Telugu

Cow Dung : ఆవు పేడతో వ్యాపారం…లక్షలు సంపాదిస్తున్న యువకుడు..!!

cow dung

cow dung

ఆవుపేడ వ్యవసాయానికి ఎంతో లాభసాటి. ఆవుపేడ ఎరువులు చాలా సారవంతమైనవి. వ్యవసాయానికే కాదు…దీంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆవు పేడతో డబ్బులు సంపాదించవచ్చని చెబుతోంది ప్రభుత్వం. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. గోధన్ న్యాయ్ యోజన పేరుతో గ్రామీణ ప్రజల నుంచి పేడను కొనుగోలు చేసే పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ పథకంతో ఎంతో మంది ఉపాధి పొందుతూ…డబ్బులు బాగా సంపాదిస్తున్నారు.

కొరియా జిల్లా మనేంద్రగఢ్ ప్రాంతానికి చెందిన శ్యామ్ కుమార్…ఆవుపేడ వ్యాపారం చేస్తూ సక్సెస్ అయ్యాడు. మొదట్లో ఆయన పాల వ్యాపారం చేసేవాడు. చత్తీస్ గఢ్ సర్కార్ ఎప్పుడైతే…గోధన్ న్యాయ్ యోజన పథకం తీసుకొచ్చిందో అప్పటి నుంచి శ్యామ్ జీవితం మారిపోయింది. పాల వ్యాపారాన్ని పక్కనపెట్టి…ఆవుపేడను విక్రయించడం ప్రారంభించాడు. అలా అప్పటివరకు 4లక్షల 10వేల రూపాయల ఆదాయం అర్జించాడు. ఈ మధ్యే శ్యాంకుమార్ వివాహం కూడా జరిగింది. గతేడాది వరకు ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాని…పిల్లనిచ్చేందుకు కూడా ఎవరు ముందుకు రాలేదని చెప్పాడు శ్యాం కుమార్.

తన వ్యాపారం సక్సెస్ కావడంతో అతనికి ఎన్నో సంబంధాలు వచ్చాయని పెళ్లి కూడా జరిగిందని చెప్పాడు. గోధన్ న్యాయ్ యోజన పథకం తర్వాత తన జీవితం పూర్తిగా మారిందని..సంతోషం వ్యక్తం చేశాడు. ఈ పథకానికి ముందు తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నాడు. ఆవుపేడ విక్రయాల తర్వాతే..ఆర్థికంగా నిలదొక్కుకున్నానని శ్యాం కుమార్ తెలిపాడు. ఇప్పుడు అతని వ్యాపారం మూడు పువ్వులుు…ఆరు కాయలుగా సాగుతోంది. శ్యాం కుమార్ కు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి కూడా అభినందనలు తెలిపారు.

 

Exit mobile version