Gujarat Rains : గుజరాత్ లో తగ్గని వర్షాలు.. పిడుగుపాటుకు 27 మంది మృతి

గుజరాత్ లో గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Heavy Rains

Gujarat Rains : గుజరాత్ లో గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అకస్మాత్తుగా కురుస్తున్న ఈ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల వల్ల ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడు, ఎక్కడ పిడుగులు పడతాయో అని భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అకాల వర్షాలు, పిడుగుపాటుతో ఇప్పటి వరకు 27 మంది మరణించారు.

గుజరాత్ లోని తాపి, అహ్మదాబాద్, దౌడ్, బొతాద్, బనస్కాంత, పంచ్ మహల్, సూరత్, సురేంద్రనగర్, ద్వారకా, భరూచ్ లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడంతో పాటు పిడుగులు పడటంతో ఎక్కువ మంది మృత్యువాత పడ్డారని అధికారులు స్పష్టం చేశారు. ఈ వర్షాలు ఇంకొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని.. ప్రజలు వీలైనంతగా ఇంటికే పరిమితం కావాలని వాతావరణ శాక అధికారులు వెల్లడించారు. ఆకస్మిక వర్షాల వల్ల గుజరాత్ ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయి సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

  Last Updated: 28 Nov 2023, 09:06 AM IST