Rains: మార్చి 23 నుండి మరోసారి వర్షాలు.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు..!

దేశంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ వారం పలు రాష్ట్రాల్లో వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 23 నుండి పరిస్థితులు మరింత మారవచ్చు.

Published By: HashtagU Telugu Desk
Rains

Rains

దేశంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ వారం పలు రాష్ట్రాల్లో వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 23 నుండి పరిస్థితులు మరింత మారవచ్చు. వాతావరణ శాఖ కొన్ని రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్, కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మార్చి 23 నుండి పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలతో సహా వాయువ్య భారతదేశంలో విస్తృతమైన వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అహ్మదాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ మనోరమా మొహంతి మాట్లాడుతూ.. గుజరాత్‌లో వచ్చే 3-4 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, మంగళవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

వాతావరణ శాఖ ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని మరికొన్ని ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షాలు (64.5 మి.మీ-115.5 మి.మీ) కురిసే అవకాశం ఉంది. IMD.. అస్సాం, మేఘాలయాలను సోమవారం ఆరెంజ్ అలర్ట్‌లో ఉంచింది. అదే సమయంలో బీహార్, పశ్చిమ బెంగాల్, అరుణాచల్‌లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వచ్చే మూడు రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో ఉరుములు మరియు మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. 22వ తేదీన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Also Read: Air India: భారత్ నుంచి అమెరికా వెళ్లే విమానాలు తగ్గింపు.. కారణమిదే..?

IMD ప్రకారం.. సోమవారం ఢిల్లీలో గత మూడేళ్లలో మార్చిలో అత్యధికంగా 24 గంటల వర్షపాతం నమోదైంది. కేవలం మూడు గంటల్లో 6.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం కూడా దేశ రాజధానిలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 26, 16 డిగ్రీల సెల్సియస్‌లుగా నమోదయ్యే అవకాశం ఉంది.

  Last Updated: 21 Mar 2023, 10:44 AM IST