Congress Plenary Session: కాంగ్రెస్ ప్లీనరిలో ప్రియాంక క్రేజ్.. 6వేల టన్నుల గులాబీలతో గ్రాండ్ వెల్ కం!

శనివారం ఉదయం రాయ్‌పూర్‌కు చేరుకున్న ప్రియాంకకు గులాబీ (Rose Flowers) పూలతో ఘన స్వాగతం లభించింది.

Published By: HashtagU Telugu Desk
Priyanka

Priyanka

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) పార్టీ మూడు రోజుల 85వ ప్లీనరీ సమావేశానికి హాజరయ్యారు. శనివారం ఉదయం రాయ్‌పూర్‌కు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు రోడ్డు పొడవునా గులాబీ (Rose Flowers) పూలతో కార్పెట్ ను సిద్ధం చేసి ఆశ్చర్యపర్చారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర రోడ్డును అలంకరించేందుకు 6,000 కిలోలకు పైగా గులాబీలను వాడారు. దారి పొడవునా రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించిన జానపద కళాకారులు ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు.

ఉదయం 8.30 గంటలకు స్వామి వివేకానంద విమానాశ్రయానికి చేరుకున్న ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi)ను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మోహన్ మార్కం, ఇతర పార్టీ నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చి జెండాలు చేతబూని నినాదాలు చేశారు.

ఆమె విమానాశ్రయం నుండి బఘెల్‌తో పాటు కారులో బయలు దేరిన తర్వాత పెద్ద సంఖ్యలో వాహానాలు ప్రియాంక కాన్వాయ్ ను ఫాలో అయ్యాయి.  ఇక ప్రియాంక వాహనం రన్నింగ్‌ బోర్డుపై నిలబడి అభిమానులను విష్ చేసి ఉత్సాహపర్చారు. అభిమానులు ప్రియాంకపై గులాబీ రేకుల వర్షం కురిపించారు. ఇంతటి ఘన స్వాగతం లభించడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని ఆమె (Priyanka Gandhi) విలేకరులతో అన్నారు.

Also Read: Sridevi Rejected Baahubali: బాహుబలి ‘శివగామి’ పాత్రను శ్రీదేవి ఎందుకు రిజక్ట్ చేశారో తెలుసా!

  Last Updated: 25 Feb 2023, 04:36 PM IST