Indian Railway: చిన్నారికి బొమ్మ ఇవ్వటం కోసం రైల్వే సిబ్బంది ఏం చేశారో తెలుసా..?

సాధారణంగా ప్రయాణంలో వస్తువులను కోల్పోవడం సహజం. పోయిన వస్తువులు తిరిగి దొరకడం చాలా అరుదు. పోగొట్టుకున్న వస్తువును స్వయంగా ఇంటికే వచ్చి అప్పగిస్తే ఎలా ఉంటుంది. అది మాటల్లో చెప్పలేం. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.

  • Written By:
  • Publish Date - January 7, 2023 / 11:01 AM IST

సాధారణంగా ప్రయాణంలో వస్తువులను కోల్పోవడం సహజం. పోయిన వస్తువులు తిరిగి దొరకడం చాలా అరుదు. పోగొట్టుకున్న వస్తువును స్వయంగా ఇంటికే వచ్చి అప్పగిస్తే ఎలా ఉంటుంది. అది మాటల్లో చెప్పలేం. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. జనవరి 4న ఇటీవల తన తల్లిదండ్రులతో కలిసి పశ్చిమ బెంగాల్‌లోని తన స్వగ్రామానికి వెళ్లిన 19 నెలల బాలుడు తన గమ్యస్థానంలో దిగుతుండగా తనకు ఇష్టమైన బొమ్మను పోగొట్టుకున్నాడు. అదే రైలులో ఇది చూసిన సహ ప్రయాణికుడు 139కి ఫోన్ చేసి ‘రైల్ మదద్’ యాప్‌లో ఫిర్యాదు చేశాడు. రైల్వే అధికారులు ఆ బొమ్మను చిన్నారికి తిరిగి ఇస్తే చాలా బాగుంటుందని పేర్కొన్నాడు.

అయితే ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలేవీ అతని వద్ద లేవు. కేవలం బెర్త్ నెంబర్ చెప్పడం ద్వారా ప్రయాణికుల వివరాలు చిరునామా రాబట్టడం అనేది చాలా కష్టం. అవేవి లెక్కచేయకుండా చిన్నారికి ఆ బొమ్మను అందించాలని అతి కష్టం మీద వివరాలు రాబట్టగలిగారు అధికారులు. కాగా.. ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం రైల్వే సిబ్బంది చిన్నారి వివరాలను సికింద్రాబాద్ రైల్వే కౌంటర్ ద్వారా రిజర్వేషన్ చార్ట్ నుండి తీసుకున్నారు. ఆ వివరాల ప్రకారం న్యూ జలపాయిగురి స్టేషన్‌కు ముందు పోగొట్టుకున్న బొమ్మ వారికి లభించింది. దీంతో ఆ చిన్నారికి బొమ్మను ఎలాగైనా అందించాలని నిర్ణయించారు.

Also Read: Maruti Grand Vitara CNG: మారుతీ గ్రాండ్ విటారాలో CNG వేరియంట్లు రిలీజ్.. ధరలు ఇవే..!

ఇక వారి వివరాలు సేకరించి దొరికిన బొమ్మను ఆ చిన్నారికి  అందించారు. దీంతో ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేకుండాపోయింది. ఈ సందర్భంగా చిన్నారి తండ్రి రైల్వే మంత్రికి అలాగే రైల్వే సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పోగొట్టుకున్న బొమ్మను రైల్వేకు ఫిర్యాదు చేసి ఆ చిన్నారి ముఖంలో ఆనందానికి కారణమైన భుసిన్ పట్నాయక్‌ను, రైల్వే సిబ్బంది కృషికి దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ అభినందించారు.