Indian Railways : జనవరి 1 నుంచి రైల్వే కొత్త టైం టేబుల్

ప్రస్తుతం అమల్లో ఉన్న ‘ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్’ 44వ ఎడిషన్ డిసెంబర్ 31తో ముగిస్తుంది. ఆ వెంటనే కొత్త టైమ్ టేబుల్ అందుబాటులోకి రానుంది.

Published By: HashtagU Telugu Desk
Railway new time table from January 1

Railway new time table from January 1

Indian Railways : జనవరి 1 నుంచి ఇండియన్ రైల్వే కొత్త టైం టేబుల్ అమల్లోకి తీసుకొస్తోంది. సాధారణంగా రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జూన్ 30 నాటికి విడుదల చేస్తుంది. అయితే ఈ సంవత్సరం నూతన టైం టేబుల్ జూలై 1 నుంచి అమలులోకి రానుంది. అంతేకాకుండా 2025లో కొత్తగా 136 రైళ్లను ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోంది. నమో భారత్ ర్యాపిడ్ రైల్(వందే మెట్రో), రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, ఇతర సర్వీసులు ప్రారంభించే యోచనలో ఉంది. గత సంవత్సరం, ప్రయాణీకులు సౌకర్యాన్ని పెంచేందుకు జాతీయ రవాణా సంస్థ 64 వందే భారత్ రైళ్లను 70 అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక జనవరి నుంచి అందుబాటులోకి వచ్చే కొత్త రైల్వే టైమ్ ​టేబుల్ ​లో ఏ అంశాలు ఉంటాయి? కొత్తగా ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటాయా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంటుంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న ‘ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్’ 44వ ఎడిషన్ డిసెంబర్ 31తో ముగిస్తుంది. ఆ వెంటనే కొత్త టైమ్ టేబుల్ అందుబాటులోకి రానుంది. గత ఏడాది రైల్వే సంస్థ ఆల్ ఇండియా రైల్వే టైమ్ టేబుల్ – ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్ (TAG)ను రిలీజ్ చేసింది. ఇది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. సాధారణంగా, రైల్వే మంత్రిత్వ శాఖ ‘ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్’(TAG)టైమ్‌ టేబుల్‌ ను ప్రతి సంవత్సరం జూన్ 30కి ముందు విడుదల చేస్తుంది. కొత్త టైమ్‌ టేబుల్ జూలై 1 నుండి అమల్లోకి వస్తుంది. అయితే, ఈ సంవత్సరం నిబంధనలు సవరించబడ్డాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లకు సంబంధించిన సమయాలను సవరిస్తూ కొత్త టైమ్ టేబుల్‌ అందుబాటులోకి రానుంది.

కాగా, మహా కుంభమేళా 2025కు సన్నాహకంగా ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఈ కార్యక్రమానికి హాజరయ్యే లక్షలాది మంది భక్తులకు ప్రపంచస్థాయి సౌకర్యాలను కల్పిస్తున్నది. దాదాపు 3 వేల ప్రత్యేక రైళ్లను నడపడంతోపాటు లక్ష మందికిపైగా ప్రయాణికులకు ఆశ్రయం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 28 వరకు మహాకుంభ్‌ గ్రామ్‌లో బస కోసం ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, టూరిజం డిపార్టుమెంట్‌ వెబ్‌సైట్‌, మహాకుంభ్‌ యాప్‌లో అదనపు సమాచారం అందుబాటులో ఉండటంతో.. వాటి ద్వారా సులభంగా రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం ఉంది.

Read Also: Himanshu Gift : కేటీఆర్ కు హిమాన్షు అదిరిపోయే గిఫ్ట్..చూసి వావ్ అనాల్సిందే..!!

  Last Updated: 28 Dec 2024, 05:40 PM IST