Rail one APP : రైల్వే ప్యాసింజర్ కోసం భారతీయ రైల్వే సరికొత్త ఆవిష్కరణను ముందుకు తీసుకొచ్చింది.రైల్వే ప్రయాణికుల సౌలభ్యం కోసం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జులై 1, 2025న న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో రైల్‌వన్ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు.సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) 40వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యాప్‌ను ప్రారంభించారు. ఈ సూపర్ యాప్ రైల్వే సేవలన్నింటినీ ఒకే వేదికపై అందించడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.
రైల్‌వన్ యాప్ ఉద్దేశం ఏంటంటే..
రైల్‌వన్ యాప్ ఒక సమగ్ర డిజిటల్ వేదికగా రూపొందించబడింది. ఇది IRCTC రైల్ కనెక్ట్, UTS, రైల్ సాయం, NTES, ఫుడ్ ఆన్ ట్రాక్ వంటి వివిధ యాప్‌ల సేవలను ఒకే చోట అనుసంధానిస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు ఒకే లాగిన్‌తో అన్ని సేవలను ఉపయోగించవచ్చు, ఇది బహుళ యాప్‌ల అవసరాన్ని తగ్గిస్తుంది.ఫోన్ స్టోరేజ్‌ను ఆదా చేస్తుంది.
అందుబాటులోని సేవలు..
రైల్‌వన్ యాప్ టికెట్ బుకింగ్ (రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్, ప్లాట్‌ఫాం టికెట్లు), PNR స్టేటస్ ట్రాకింగ్, రైలు స్థితి , కోచ్ స్థానం, జర్నీ ప్లానింగ్, రైల్ మదద్ ద్వారా ఫిర్యాదులు, రీఫండ్ అభ్యర్థనలు, ఆన్‌బోర్డ్ ఫుడ్ ఆర్డరింగ్, పోర్టర్ , టాక్సీ బుకింగ్ వంటి సేవలను అందిస్తుంది. అదనంగా, అన్‌రిజర్వ్‌డ్ మరియు ప్లాట్‌ఫాం టికెట్లపై 3% డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ప్రత్యేక ఫీచర్లు..
ఈ యాప్ సింగిల్ సైన్-ఆన్ (SSO) సౌలభ్యంతో పాటు బయోమెట్రిక్, mPIN లాగిన్ ఎంపికలను అందిస్తుంది. R-వాలెట్ (రైల్వే ఈ-వాలెట్) ద్వారా సులభమైన చెల్లింపులు, బహుభాషా మద్దతు, గెస్ట్ లాగిన్ (మొబైల్ నంబర్ మరియు OTP ద్వారా) వంటి ఫీచర్లు యూజర్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ iOS యాప్ స్టోర్‌లలో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
భవిష్యత్తు లక్ష్యాలు..
రైల్‌వన్ యాప్ రైల్వే సేవలను డిజిటల్‌గా అందించడంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ యాప్ భారతీయ రైల్వే డిజిటల్ బ్యాక్‌బోన్‌ను బలోపేతం చేయడంతో పాటు, సైబర్‌సెక్యూరిటీ ఆధునిక ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) అభివృద్ధికి దోహదపడుతుంది. ఇది డిసెంబర్ 2025 నాటికి పూర్తవుతుందని మంత్రి వైష్ణవ్ ప్రకటించారు. కాగా, రైల్ వన్ యాప్ తీసుకురావడంపై రైలు ప్యాసింజర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు వరకు వివిధ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుని ఇబ్బంది పడే వారికి ఇది ఒక అద్భుతసాధనం అనే చెప్పాలి. ముఖ్యంగా రైలు ప్రయాణాలు చేసే ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతుంది.
Anti aging : ప్రాణాలు తీస్తున్న యాంటీ ఏజింగ్ మెడిసిన్.. బాలీవుడ్ సెలబ్రిటీలే బాధితులు!