Zika virus: ఆ రాష్ట్రంలో తొలి జింకా వైరస్ కేసు నమోదు

కర్ణాటక రాష్ట్రంలో తొలి జింకా వైరస్ (Zika virus) కేసు నమోదైంది. 5 ఏళ్ల పాపలో ఈ వైరస్‌ను గుర్తించినట్లు అధకారులు తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు.

  • Written By:
  • Publish Date - December 13, 2022 / 08:10 AM IST

కర్ణాటక రాష్ట్రంలో తొలి జింకా వైరస్ (Zika virus) కేసు నమోదైంది. 5 ఏళ్ల పాపలో ఈ వైరస్‌ను గుర్తించినట్లు అధకారులు తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు. ‘‘రాష్ట్రంలో ఇదే తొలి కేసు. పరిస్థితిని ప్రభుత్వం జాగ్రత్తగా పర్యవేక్షిస్తోంది. ఏం జరిగినా హ్యాండిల్ చేసేందుకు ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది’’ అని ఆయన తెలిపారు.

కర్ణాటకలో ఐదేళ్ల బాలికకు జికా వైరస్‌ (Zika virus) సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ సోమవారం మాట్లాడుతూ.. రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలికకు జికా వైరస్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇలాంటి కేసు ఇదే తొలిసారి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజలకు మార్గదర్శకాలను కూడా త్వరలో విడుదల చేస్తామని మంత్రి సుధాకర్ తెలిపారు. జికా వైరస్ నిర్ధారణ అయిన కేసు గురించి పూణే నుండి మాకు ల్యాబ్ నివేదిక అందిందని ఆయన తెలియజేశారు. డిసెంబరు 5న కొన్ని నమూనాలను దర్యాప్తు కోసం పూణెకు పంపారు. దీని నివేదిక డిసెంబర్ 8న అందింది.

మూడు శాంపిల్స్‌ను పంపగా అందులో రెండు నెగిటివ్‌, ఒకటి పాజిటివ్‌ అని చెప్పారు. ఇది ఐదేళ్ల బాలిక శాంపిల్. అయినా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఇప్పటివరకు కొత్త జికా వైరస్ కేసులేవీ నమోదు కాలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ప్రభుత్వం జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని మంత్రి తెలిపారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితం కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో జికా వైరస్‌ కేసులు నమోదయ్యాయని, కర్నాటకలో ఇదే మొదటి కేసు అని చెప్పారు. సీరమ్‌ను డెంగ్యూ, చికున్‌గున్యా పరీక్షలు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఇలాంటి 10 శాతం శాంపిల్స్‌ను పరీక్షల కోసం పూణేకు పంపగా, అందులో పాజిటివ్‌గా తేలింది.

Also Read: India- China Troops: భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తత

ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోందని రాయచూరు, పొరుగు జిల్లాల్లోని నిఘా (ఆరోగ్య శాఖ) అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చామని చెప్పారు. ఇలాంటి అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే జికా వైరస్ పరీక్ష కోసం శాంపిల్స్ పంపాలని, ఈ అమ్మాయికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదని తెలిపారు. జికా వైరస్ వ్యాధి సోకిన ఏడిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇది డెంగ్యూ, చికున్‌గున్యా వంటి ఇన్ఫెక్షన్లను కూడా వ్యాప్తి చేస్తుంది. 1947లో ఉగాండాలో తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు.