Site icon HashtagU Telugu

Rahul Gandhi: భార‌త్ మ‌రో ఉక్రెయిన్.. రాహుల్ సంచ‌ల‌న ట్వీట్‌!

Rahul Gandhi Petrol Diesel Price

Rahul Gandhi Petrol Diesel Price

చైనా దూకుడు భార‌త్ ను మ‌రో ఉక్రెయిన్ గా మారుస్తుంద‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఆ మేర‌కు ట్వీట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న సీరియ‌స్ గా ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం రష్యా ఏ విధంగా ఉక్రెయిన్ ను ఆక్ర‌మించుకుంటుందో, ఆ విధంగా చైనా కూడా భార‌త్ ను ఆక్ర‌మించే అవ‌కాశం ఉంద‌ని రాహుల్ సంచ‌ట‌న ట్వీట్ చేయ‌డం దుమారం రేగుతోంది. ర‌ష్యా మాదిరే చైనా కూడా దేశ స‌రిహ‌ద్దుల‌ను గౌర‌వించ‌డం లేదు. ఈ దురాక్ర‌మ‌ణ‌ల‌ను మోదీ స‌ర్కారు గుర్తించ‌డం లేదు. స‌రైన స‌మ‌యంలో మేల్కొన‌క‌పోతే ఉక్రెయిన్‌పై ర‌ష్యా ఎలాగైతే దాడి చేసిందో, అదే మాదిరిగా చైనా కూడా మ‌న దేశంపై దాడి చేస్తుంది “ అని రాహుల్ గాంధీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దండెత్తిన ర‌ష్యా దురాక్ర‌మ‌ణ వైఖ‌రిని ప్ర‌స్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్ర‌భుత్వంపై విరుచుకుపడ్డారు.

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దండెత్త‌డానికి కార‌ణం ర‌ష్యా దురాక్ర‌మ‌ణ వాద‌మే అంటూ రాహుల్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఉక్రెయిన్‌లోని డొనెట్క్స్‌, లుహాన్క్స్ ప్రాంతాలు ఉక్రెయిన్ అంత‌ర్భాగాల‌ని ర‌ష్యా భావించ‌డం లేదు. ఆ దేశాల మ‌ధ్య స‌రిహ‌ద్దుల‌ను కూడా ర‌ష్యా గౌర‌వించ‌డం లేదు. కేవ‌లం ఈ భావ‌న‌తోనే ఉక్రెయిన్‌పై ర‌ష్యా దండెత్తింది. ఈ దండ‌యాత్ర వెనుక అస‌లు లక్ష్యం నాటో, అమెరికాల నుంచి ఉక్రెయిన్ ను విడ‌దీయ‌డ‌మే న‌ని రాహుల్ పేర్కొన్నారు. భార‌త ప్ర‌భుత్వం. వ్య‌వ‌హరిస్తోన్న విదేశాంగ విధానంపై ఆరోప‌ణ‌లు చేస్తూ ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం చేస్తోన్న తీరును త‌న‌దైన శైలిలో విశ్లేష‌ణ‌ను వినిపించారు. ర‌ష్యా త‌ర‌హాలోనే భార‌త పొరుగు దేశం చైనా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని రాహుల్ గాంధీ స‌రికొత్త వాద‌న‌ను వినిపించారు. భార‌త్‌లో అంతర్భాగ‌మైన అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఎప్ప‌టిక‌ప్పుడు స‌రిహ‌ద్దు వివాదాన్ని రేపుతున్న చైనా, అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణంగా నిలుస్తోంది. మొత్తం మీద రాహుల్ చేసిన తాజా ట్వీట్ దుమారం రేపుతోంది.