Site icon HashtagU Telugu

Rahul Gandhi : దళిత కుటుంబం ఇంట్లో భోజనం చేసిన రాహుల్

Rahul Gandhi Heartfelt Cook

Rahul Gandhi Heartfelt Cook

రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొల్హాపూర్ (MH)లో దళిత వర్గానికి చెందిన ఓ కుటుంబం ఇంట్లో వంట వండి భోజనం చేసి వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా రాహుల్ నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్రతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసిన రాహుల్ .. ఆ తర్వాత కూడా సామాన్య ప్రజల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. రైతులు, రోజువారీ కూలీలు, మెకానిక్‌లు, గిగ్ వర్కర్లతో ఆఖరికి చెప్పులు కుట్టే వ్యక్తి వద్దకు వెళ్లి చెప్పులు సైతం కుట్టి ప్రజానేత అనిపించుకున్నాడు రాహుల్.

తాజాగా ఓ దళితుడి ఇంటికి వెళ్లి వంట చేసి చేయడం తో కాదు వారితో కలిసి భోజనం చేసి వారి కుటుంబంలో సంతోషం నింపారు. కొల్హాపూర్‌లోని అజయ్ తుకారాం సనాదే (Tukaram Sanade), అంజనా తుకారాం (Anjana Tukaram) సనాదే అనే దళిత దంపతుల ఇంటికి వెళ్లారు రాహుల్. దళితుల వంటగది గురించి ఇప్పటికీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని రాహుల్ గాంధీ తెలిపారు. కులవివక్ష అనే అంశంపై ఆ కుటుంబంతో మాట్లాడారు. వంట చేయడం (Rahul cooking) పూర్తి అయిన తర్వాత ఆ దళితుడి కుటుంబంతో కలిసి రాహుల్‌ గాంధీ భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ‘దళిత్ కిచెన్స్ ఆఫ్ మరాఠ్వాడా’ రచయిత షాహూ పటోలేతో కలిసి వంట చేసాడు. ‘ఈనాటికీ దళితుల వంటశాల గురించి తక్కువ మందికి తెలుసు. పటోలే చెప్పినట్లు దళితులు ఏం తింటారో ఎవరికీ తెలియదు. వాటి ప్రాముఖ్యత తెలుసుకోవాలనుకున్నా’ అని ట్వీట్ చేశారు.

Read Also : KA Paul- Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై 14 సెక్ష‌న్ల కింద‌ కేఏ పాల్ ఫిర్యాదు

Exit mobile version