Site icon HashtagU Telugu

Rahul Gandhi:జైపూర్ వేదిక‌పై `మ‌మ‌త`కు కౌంట‌ర్ రాహుల్ 2024 ఐడియాల‌జీ ఇదే!

Parla Copy

Parla Copy

ముంబై కేంద్రంగా ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌త‌, ఐప్యాక్ ఫౌండ‌ర్ పీకే చేసిన వ్యాఖ్య‌ల‌ను కౌంట‌ర్ గా కాంగ్రెస్ జైపూర్ ర్యాలీ నిల‌చింది. కాంగ్రెస్ పార్టీ 2024 ర‌థ‌సార‌ధి రాహుల్ గా హైలెట్ చేసింది. జీ 23 లీడ‌ర్స్ తో పాటు సోనియా గాంధీ కూడా ఇదే స‌భ‌లో పాల్గొన్నారు. వేదిక‌పై సీనియ‌ర్లు అంద‌రూ ప్ర‌సంగించిన త‌రువాత చివ‌రిగా రాహుల్ స్పీచ్ ఉంది. కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా వేదిక‌పై ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌సంగించ‌లేదు. దీంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌గ్గాలు మ‌ళ్లీ రాహుల్ చేప‌డ‌తార‌ని స్ప‌ష్టం అవుతోంది.
హిందూ, హిందుత్వవాది మ‌ధ్య తేడాను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్లాల‌ని రాహుల్ పిలుపు ఇవ్వ‌డం స‌రికొత్త చ‌ర్చ‌కు దారితీసింది. గాంధీ మార్గంలో వెళ్లే కాంగ్రెస్ పార్టీ హిందుత్వ‌వాది, హిందూ మ‌ధ్య తేడాను గ‌మ‌నించి ముందుకు వెళుతుంద‌ని ఆయ‌న దిశానిర్దేశం చేశాడు. కాంగ్రెస్ ఐడియాల‌జీని బ‌లంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్ల‌డానికి సిద్ధం కావాల‌ని పిలుపు నిచ్చాడు. గాంధీ చెప్పిన హిందూ మార్గం కాంగ్రెస్ పార్టీ అనుస‌రిస్తోంద‌ని, హిందుత్వ‌వాదిగా బీజేపీ త‌ర‌హాలో త‌మ ఐడియాల‌జీ ఉండ‌ద‌నే విష‌యాన్ని శ్రేణుల‌కు రాహుల్ దిశానిర్దేశం చేయ‌డం విశేషం. 70 ఏళ్ల కాంగ్రెస్ పాల‌న‌లో నిర్మించిన వాటిని విక్ర‌యించ‌డ‌మే మోడీ సిద్ధాంత‌మ‌ని ఆయ‌న ఫైర్ కావ‌డం ఆక‌ట్టుకుంది.
దేశంలో బీజేపీ పార్టీకి ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అనే నినాదాన్ని బ‌లంగా జైపూర్ వేదిక నుంచి ఆ పార్టీ నేత‌లు తీసుకెళ్లారు. దేశంలోని ప‌లు రాష్ట్రాల నుంచి హాజ‌రైన సీనియ‌ర్లు ఒకే వేదిక‌పై క‌నిపించ‌డం ఆ పార్టీలోని ఐక్య‌తారాగాన్ని మ‌రోసారి వినిపించే ప్ర‌య‌త్నం జ‌రిగింది. అంతేకాదు, కాంగ్రెస్ భావ‌జాలానికి ద‌గ్గ‌ర‌గా ఉండే పార్టీల‌ను క‌లుపుకుని వెళ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌నే సంకేతం ఆ వేదిక మీద నుంచి వినిపించారు. యూపీఏ లేద‌న్న విష‌యాన్ని మ‌మ‌త‌, పీకే వ్య‌క్తం చేసిన క్ర‌మంలో జైపూర్ వేదిక‌గా కాంగ్రెస్ కౌంట‌ర్ ఇచ్చింది.
2024లో కాంగ్రెస్ పార్టీని రాహుల్ లీడ్ చేస్తాడ‌ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అజ‌య్ మెక‌న్ సంకేతాలిచ్చాడు. త్వ‌ర‌లోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్య‌త‌ల‌ను రాహుల్ తీసుకుంటాడ‌ని చ‌త్తీగ‌ఢ్ సీఎం భూపేష్ భ‌గ‌ల్ జైపూర్ వేదిక‌పై వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. జీ 23లీడ‌ర్ల కొంద‌రు హాజ‌రైన ఈ వేదిక‌పై నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ స‌చిన్ పైలెట్ కూడా రాబోయే రోజుల్లో రాహుల్ నాయ‌క‌త్వంలోనే కాంగ్రెస్ 2024 ఎన్నిక‌ల‌కు వెళుతుంద‌ని సంకేతాలిచ్చాడు.
కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాలను చూపుతూ ద్వారకలో మార్చ్‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి నిరాకరించడంతో “మహంగై హటావో మహా ర్యాలీ” జైపూర్ లో కాంగ్రెస్ నిర్వ‌హించింది. జైపూర్ వేదిక‌గా ఆద్యంత‌మూ మ‌మ‌త‌, పీకే చేసిన కామెంట్ల‌కు బ్రేక్ వేసేలా సాగిన కాంగ్రెస్ నేత‌ల ప్ర‌సంగాలపై చ‌ర్చ జ‌రుగుతోంది.