రాజీవ్‌గాంధీ 78వ జయంతి సందర్భంగా వీర్‌భూమిలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నివాళులర్పించారు. “నా హృదయంలో ప్రతిసారీ మీరు నాతో ఉంటారు, నేను ఎల్లప్పుడూ మీరు ప్రేమించిన దేశం కోసం కలలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను.. అంటూ రాహుల్ గాంధీ తన తండ్రి గురించి ట్వీట్ చేశారు. “భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మేము ఆయన జయంతి సందర్భంగా ప్రేమగా స్మరించుకుంటాము. ’21వ శతాబ్దపు భారతదేశ రూపశిల్పి’గా కీర్తించబడ్డాడు, భారతదేశంలో IT & టెలికాం విప్లవం ఆయన దూర దృష్టితో వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో పేర్కొంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని యువజన కాంగ్రెస్ (ఐవైసీ) తల్కతోరా స్టేడియంలో దివంగత ప్రధానమంత్రి కృషిని హైలైట్ చేయడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఐవైసీ అధ్యక్షుడు శ్రీనివాస్ బివి మాట్లాడుతూ.. పటిష్టమైన, స్వావలంబనతో కూడిన భారత్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేసిన రాజీవ్‌గాంధీ ఆధునిక భారతదేశ రూపశిల్పి అని, ఆయన ఆశయాల వల్ల దేశం ఇప్పటికీ సత్ఫలితాలనిస్తోందన్నారు. ఆయన దూరదృష్టి వల్లనే భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపిందన్నారు.
पापा, आप हर पल मेरे साथ, मेरे दिल में हैं। मैं हमेशा प्रयास करूंगा कि देश के लिए जो सपना आपने देखा, उसे पूरा कर सकूं। pic.twitter.com/578m1vY2tT
— Rahul Gandhi (@RahulGandhi) August 20, 2022
