Site icon HashtagU Telugu

Priyanka- Rahul : అమేథీ నుండి రాహుల్..రాయ్ బరేలీ నుండి ప్రియాంక బరిలోకి..?

Priyanka Rahul

Priyanka Rahul

దేశ వ్యాప్తంగా లోక్ సభ (Lok Sabha) ఎన్నికల సమరం నడుస్తుంది. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ (Congress) , బిజెపి (BJP) సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన బిజెపి..ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బిజెపి చూస్తుంటే..ఆ ఛాన్స్ ఇవ్వకూడదంటూ కాంగ్రెస్ చూస్తుంది. ఇదిలా ఉంటె కాంగ్రెస్ కంచుకోటల్లో ఈసారి గాంధీ కుటుంబం నుండి ఎవరు బరిలోకి దిగుతారనే ఆసక్తి గత కొద్దీ రోజులుగా దేశ వ్యాప్తంగా నెలకొని ఉంది. ఈ తరుణంలో ఆసక్తి తెరపడినట్లే అని సమాచారం అందుతుంది. గాంధీ కుటుంబానికి పెట్టని కోటలా భావించే రాయ్ బరేలీ (Rae Bareli) లోక్ సభ స్థానం ఒకటి కాగా..అమేథీ (Amethi ) మరోటి.

We’re now on WhatsApp. Click to Join.

రాయ్ బరేలీ నుండి ప్రతిసారి గాంధీ కుటుంబం నుండి ఎవరొకరు బరిలో నిల్చుని విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి సోనియా గాంధీ నిల్చుని భారీ విజయం సాధించింది. కానీ ఈసారి ఆరోగ్య రీత్యా లోక్ సభ కు దూరంగా ఉంది. రాజ్యసభ కు ఎన్నికైంది. దీంతో ఈసారి రాయ్ బరేలీ స్థానంలో ప్రియాంక గాంధీ బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం అందుతుంది. అలాగే యూపీలోని అమేథీ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. ఇక్కడి నుండి రాహుల్ గెలుస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని అమేథీ బరిలో నిలబెట్టి రాహుల్ గాంధీని ఓడించింది బిజెపి. గత సార్వత్రిక ఎన్నికల్లో అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా రాహుల్ పోటీ చేసి అక్కడ గెలిచి..లోక్ సభ లో అడుగుపెట్టారు. ఈసారి అమేథీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలోకి దింపుతుందనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈసారి కూడా రాహులే ఇక్కడి నుండి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. రాయ్ బరేలీ తోపాటు అమేథీ నియోజకవర్గాల్లో శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సీట్లలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు పోటీ చేయడం దాదాపు కన్ఫార్మ్ అయిందని, వచ్చే నెల 1వ తేదీ నుంచి 3వ తేదీలోగా రాహుల్, ప్రియాంక గాంధీలు తమ నామినేషన్లు దాఖలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.

Read Also : Zomato: జొమాటో మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఫాస్ట్ డెలివరీలు కావాలంటే ఎక్స్‌ట్రా ఫీజు కట్టాల్సిందే..!

Exit mobile version