Twitter Politics : ట్విట్ట‌ర్ కు రాజ‌కీయ మ‌కిలీ

`ట్విట్ట‌ర్ ` రాజ‌కీయ రంగును పులుముకుంది. ఆ కంపెనీ నిర్వాకంపై కాంగ్రెస్ ప‌లు అనుమానాలను వ్య‌క్తం చేసింది.

  • Written By:
  • Publish Date - March 7, 2022 / 02:38 PM IST

`ట్విట్ట‌ర్ ` రాజ‌కీయ రంగును పులుముకుంది. ఆ కంపెనీ నిర్వాకంపై కాంగ్రెస్ ప‌లు అనుమానాలను వ్య‌క్తం చేసింది. కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ అకౌంట్ ఫాలోవ‌ర్స్ సంఖ్యను త‌గ్గించి చూప‌డం వెనుక ఇత‌రుల ప్ర‌భావం ఉంద‌ని ఆ పార్టీ విశ్వసిస్తోంది. ప్ర‌స్తుతం 20 మిలియ‌న్ల‌కు చేరుకున్న ఆయ‌న ఫాలోవ‌ర్ల సంఖ్య‌ను కోడ్ చేస్తూ ఇప్ప‌టి వ‌ర‌కు ట్విట్ట‌ర్ చేసిన నిర్వాకాన్ని కాంగ్రెస్ ఎత్తిపొడిచింది.ఇప్ప‌టి వ‌ర‌కు రాహుల్ ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్ల సంఖ్య పెర‌గ‌లేదు. ఆక‌స్మాత్తుగా 20 మిలియ‌న్ల‌కు చేరుకోవ‌డంపై రాజ‌కీయం ఉంద‌ని అనుమానిస్తోంది. ఆ మేర‌కు కాంగ్రెస్ ట్వీట్ చేస్తూ, “శ్రీ @రాహుల్ గాంధీ యొక్క ట్విట్టర్ ఫాలోవర్లు 20 మిలియన్ల మార్కును దాటింది. ట్విట్టర్ CEOకి రాహుల‌ రాసిన లేఖ ఆపై ఫాలోవర్ల సంఖ్య పెరగడం, అతని అనుచరుల సంఖ్య స్తంభింపజేయడం త‌దిత‌రాల‌న్నీ ట్విట్టర్ పై ఏదో తెలియ‌ని రాజ‌కీయ శ‌క్తి మార్గనిర్దేశం చేయబడిందని రుజువు చేస్తుంది` అని ఆరోపించాడు.

ట్విట్టర్ “బహిర్గతం” అని పార్టీ హ్యాష్‌ట్యాగ్‌ను ఉంచింది. దీంతో వారం క్రితం వారి సంఖ్య 20 మిలియన్లకు చేరుకుందని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ రోహన్ గుప్తా మాట్లాడుతూ, “రాహుల్‌ ట్విట్టర్‌కు లేఖ రాసినందున 20 మిలియ‌న్లు సాధ్య‌మ‌య్యాయ‌ని అన్నాడు. అయితే కాంగ్రెస్ హ్యాండిల్ చేస్తోన్న ఇత‌ర ఖాతాలు అవాంతరాలను ఎదుర్కొంటున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డింది. ప్రభుత్వం ఒత్తిడితో ట్విట్టర్ పాద‌ర్శ‌కంగా పని చేయదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.డిసెంబరు 27, 2021న రాహుల్ గాంధీ ఈ సమస్యను ఫ్లాగ్ చేశాడు. 2021 మొదటి ఏడు నెలలకు సగటున 4 లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నాన‌ని ట్విట్టర్ CEOకి లేఖ రాశాడు. ఆగస్టులో సస్పెన్షన్ తర్వాత చాలా నెలలు ఫాలోవ‌ర్ల సంఖ్య ఆకస్మికంగా నిలిచిపోయిందని ఆ లేఖలో రాహుల్ ఇలా రాశాడు. “నేను ఢిల్లీలో అత్యాచార బాధితురాలి కుటుంబం యొక్క దుస్థితిని లేవనెత్తాను. రైతులకు సంఘీభావంగా నిలిచాను మరియు అనేక ఇతర మానవ హక్కుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాను. వాస్తవానికి, నా వీడియో 3 అపఖ్యాతి పాలైన రైతులకు హామీ ఇచ్చింది. ఇటీవలి కాలంలో భారతదేశంలోని ఏ రాజకీయ నాయకుడు పోస్ట్ చేసిన ట్విట్టర్‌లో అత్యధికంగా వీక్షించబడిన వీడియోలలో వ్యవసాయ చట్టాలు రద్దు చేయబడతాయి.` ` అని రాహుల్ లేఖ‌లో ఆరోపించాడు. దానిపై స్పందించిన ట్విట్టర్ ప్రతినిధి ఆరోపణను ఖండించాడు. “ప్లాట్‌ఫారమ్ మానిప్యులేషన్ మరియు స్పామ్‌పై మా విధానాలను ఉల్లంఘించినందుకు ప్రతి వారం మిలియన్ల ఖాతాలను తొలగిస్తామ‌ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ, ట్విట్ట‌ర్ అధికార పార్టీకి కొమ్ముకొస్తూ ప్రతిప‌క్ష పార్టీల ఫాలోవ‌ర్ల సంఖ్య‌ను త‌గ్గించేస్తోంద‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.